తెలంగాణలో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మద్యం ధరలు పెంచాలని బ్రూవరీలు… ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం మద్యం ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు మద్యం ధరలు పెంచడమే ఏకైక మార్గమని భావించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. మద్యం ధరలు ఎంత పెంచినా తాగక మానరు. ఆ వ్యసనం అలాంటిది. దానిని అలవాటుగా చేసుకున్న వారు ఎంత ధరపైట్టైనా కొనుగోలు చేస్తారు.
సాధారణంగా బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి పెంచుతుంది. అలాగే ఈసారి వివిధ రకాల మద్యంపై రూ. 20 నుంచి రూ. 150 పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరాయి. తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ప్రతి సంవత్సరం 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది.
ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈసారి పది రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకు పైగా మద్యాన్ని తెలంగాణ మందుబాబులు తాగేశారు. మద్యం అమ్మకాల్లో ఈసారి కూడా హైదరాబాద్ ముందు నిలిచింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా… అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ రూ.1,100 కోట్ల విలువైన 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజుల వ్యవధిలో 17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 2 వేల 260 మద్యం దుకాణాలు, 1,171బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30 వరకు 2 వేల 838 కోట్ల అమ్మకాలు జరగ్గా… అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ 1,100 కోట్ల మేర విలువైన బీర్ల ఉత్పత్తి కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10-15శాతం మేర పెంచాలని.. తద్వారా మద్యం ధరలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. రాష్ట్రంలోని 6 బ్రూవరీల్లో ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి జరుగుతోంది. 12 బీర్లు ఉండే ఒక కేసుకు బేవరేజెస్ కార్పొరేషన్ లైట్ బీర్లకు రూ.289, స్ట్రాంగ్ బీర్లకు రూ.313 చెల్లిస్తున్నది.
మద్యం దుకాణాలు ఒక్కో కేసు రూ.1,800 చొప్పున అమ్ముకుంటున్నాయి. తయారీ కేంద్రాల వద్ద సుమారు రూ.24కి లభించే ఒక బీరు.. వినియోగదారులకు వచ్చేసరికి రూ.150 అవుతుంది. అయితే, బ్రూవరీల నుంచి వచ్చిన ప్రతిపాదనల పైన అధికారులు కసరత్తు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. అయితే, గతంలోనూ ఇదే రకమైన ప్రచారం జరగ్గా, నాడు ప్రభుత్వం ఖండించింది. కానీ, ఇప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెరిగేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన ప్రభుత్వం అధికారికంగా తమ నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.