తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్లో భారీ ప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్-1లోని ఫేజ్-2లో జూన్ 2, మంగళవారం నాడు ఉదయం ప్రమాదం చోటుచేసుకోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బ్లాస్టింగ్ సమయంలో మిస్ ఫైర్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. మృతులను బయటకు తీసి పోస్టుమార్టం కోసం గోదావరిఖని లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu