న్యూజిలాండ్ పురుషుల జట్టు చేయలేనిది ఇప్పుడు మహిళల జట్టు సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి చరిత్ర సృష్టించింది. దీంతొ దక్షిణాఫ్రికా మహిళల జట్టు చోకర్స్ అని మరోసారి నిరూపించుకుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా రెండో ఓటమి. చివరిసారి ఆస్ట్రేలియా జట్టుపై ఓడిపోయింది. ఈసారి కూడా కీలక దశలో తడబడింది.
ఫైనల్స్‌కు చేరిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్ర సృష్టించేది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇరు దేశాల పురుషుల జట్టుగానీ, మహిళల జట్టుగానీ ఐసీసీ ప్రపంచకప్ గెలవలేదు. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య ఇంగ్లండ్‌పై ఓడిపోయింది. దక్షిణాఫ్రికా పురుషుల జట్టు ఐసిసి టోర్నమెంట్‌ల సెమీ-ఫైనల్ లేదా ఫైనల్స్‌లో కూడా చాలాసార్లు ఓడిపోయింది. అందుకే, అనేక దశాబ్దాలుగా వారికి చోకర్స్ అనే ముద్ర పడిపోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా మహిళల జట్టు కూడా చోకర్స్ గా కొనసాగుతున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. వేగంగా ఆడాలని సూచించిన ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ 7 బంతుల్లో రెండు ఫోర్లతో 9 పరుగులు చేసి ఫాస్ట్ బౌలర్ ఖాకా బౌలింగ్ లో లూస్ గా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈసారి సుజీ బ్యాట్స్ (32)తో కలిసి అమేలియా కెర్ (43) జట్టు అర్ధసెంచరీని దాటింది. మిడిల్ ఆర్డర్‌లో బ్రూక్ హాలిడే 28 బంతుల్లో ఉపయోగకరమైన 38 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. మరో రూపంలో, 15 పరుగులు రావడంతో న్యూజిలాండ్ స్కోరు మరింత పెరిగింది.
కివీస్ బౌలింగ్ అదుర్స్
దక్షిణాఫ్రికా ముందు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించిన కివీస్ జట్టు బౌలింగ్ లోను అదరగొట్టింది. సవాల్‌తో కూడిన స్కోరును ఛేదించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే ధీటుగా కనిపించింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (31), తజ్మిన్ బ్రిట్స్ (17) రాణించడంతో 6.5 ఓవర్లలోనే స్కోరు 50 దాటింది. కానీ ధీటుగా ఆడుతున్న బిట్స్ జోనాస్ బౌలింగ్ లో గ్రీన్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. 10వ ఓవర్‌లో కెర్ బౌలింగ్‌లో కెప్టెన్ లారా భారీ షాట్‌కు ప్రయత్నించింది ఔటయ్యింది. అక్కడి నుంచి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడి క్రీజులో నిలబడలేకపోయిరు. కారరువాక్ బౌలింగ్, పదునైన ఫీల్డింగ్‌తో దక్షిణాఫ్రికా జట్టును 126 పరుగులకు నియంత్రించిన కివీస్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అమేలియా కెర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.
సంక్షిప్త స్కోరు
న్యూజిలాండ్ – 158/5, సుజీ బ్యాట్స్ 32, అమేలియా కెర్ 43, బ్రూక్ హాలిడే 38, మలాబా 31 2 వికెట్లు
దక్షిణాఫ్రికా 126 ఆలౌట్- లారా వోల్వార్డ్ 33, తజ్మిన్ బ్రిట్స్ 17, అమేలియా కెర్ 24కి 3