ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న భారత ఆటగాళ్లు.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

Prime Minister Modi Praised the Indian Players Who are Supporting in the Asian Games,prime minister modi praised the Indian players,who are supporting in the Asian games,Prime Minister Modi Praised,100 Medals 100 Medals,Asian Games2023,Indian Players,PM Modi,Mango News,Mango News Telugu,Asian Games 2023,PM Modi Hails Grit,Trupti Murgunde thanks PM Modi,PM Modi praises Indian hockey team,Asian games Latest News,Asian games Latest Updates,Asian games Live News
Asian games

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్-2023లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. అదీ ఇదీ అని కాకుండా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా సత్తా చాటుతున్నారు. మరింత ఉత్సాహంతో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. తొలిసారి వంద పతకాల మార్క్‌ను భారత్ క్రాస్ చేసింది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

శనివారం ఉదయం ఆర్చరీలో భారత్‌కు రెండు గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రౌంజ్ మెడల్ వచ్చాయి. అలాగే మహిళల కబడ్డీలో భారత్‌కు స్వర్ణం లభించింది. దీంతో భారత్ ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో తొలిసారిగా వంద మార్కును అందుకుంది. ఉదయం జరిగిన మహిళల కాంపౌండ్ సింగిల్స్‌లో జ్యోతి సురేఖ గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే అదితి గోపిచంద్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. అటు పురుషుల కాంపౌండ్ సింగిల్స్‌లో ఓజాస్ ప్రవీణ్ డియోటలే గోల్డ్ మెడల్.. అభిషేక్ వర్మ బ్రౌంజ్ మెడల్ సాధించారు. అప్పటికే భారత్ ఖాతాలో నాలుగు మెడల్స్ ఉండగా.. ఈ నాలుగుతో కలిపి మొత్తం 99 పతకాలు అయ్యాయి.

అలాగే ఈరోజు మహిళల కబడ్డీ మ్యాచ్ కూడా జరిగింది. ఫైనల్లో భారత్, చైనా జట్లు తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుతంగా రాణించి.. చైనా జట్టును మట్టికరిపించింది. విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ మెడల్ రావడంతో భారత్ ఖాతాలోకి వంద పతకాలు వచ్చి చేరాయి. మరిన్ని పతకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పతకాల పట్టికలో 354 మెడల్స్‌తో చైనా మొదటి స్థానంలో కొనసాగుతోంది. జపాన్ 169 పతకాలతో రెండో స్థానంలో.. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 171 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఖాతాలో 25 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రౌంజ్ మెడల్స్ ఉన్నాయి.

ఇక ఆసియా గేమ్స్‌లో భారత్ ఆటగాళ్లు వంద పతకాలు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లకు అభినందనలు చేశారు. అథ్లెట్లు దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఆసియా గేమ్స్ ముగిసిన తర్వాత అక్టోబర్ 10న అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటగాళ్లను స్వయంగా కలిసి.. వారితో సంభాషించాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నానని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =