అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అపర కుబేరుల హవా నడుస్తోంది. మరో కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలు కానున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హరీస్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బిలియనీర్స్ ల హవా నడుస్తోంది. అపర కుభేరుల నుంచి విరాళాలను సేకరించేందుకు అధికార డెమొక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి.
తాజాగా ఈ విరాళాల లిస్టులోకి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చేరారు. ఈయన డెమొక్రటిక్ పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతి వనిత, ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో డెమొక్రటిక్ పార్టీకి బిల్‌గేట్స్ ఏకంగా రూ.420 కోట్ల విరాళాన్ని అందించారు. కమలాహారిస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ ఫార్వర్డ్’ అనే స్వచ్ఛంద సంస్థకు ఈ విరాళాన్ని గేట్స్ సమకూర్చారు.
త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారో బిల్ గేట్స్ బహిరంగంగా ప్రకటించలేదు. అయితే, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళనను ఆయన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు అందిన సమాచారం.
ఈ ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవి. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి, పేదరికాన్ని తగ్గించడానికి ఇంకా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను మార్చడానికి పనిచేస్తున్న వారికి నేను మద్దతు ఇస్తున్నాను. రాజకీయ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం నాకు చాలా ఏళ్లు ఉంది. కానీ, ఈ ఎన్నికలు పూర్తి భిన్నంగా ఉన్నాయి అని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జోడెన్ ఇటీవల ఒక సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అధ్యక్ష రేసు నుండి వైదొలిగి, హారిస్ కు మద్దతును ఇచ్చారు. బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కూడా హారిస్‌కు మద్దతుగా ఓటు వేశారు.