దీపావళి పండుగ మన దేశంలో అంగరంగ వైభవంగా జరుకుంటారు. మన జీవితపు అజ్ఞాన చీకట్లను తొలగించడానికి ఈ దీపాల పండుగను నిర్వహిస్తారు. ముఖ్యంగా చిన్నా పెద్దా అంతా కలిసి వైభవంగా జరుపుకొంటారు. ఈ ఏడాది అక్టోబర్ 12న దసరా పండుగ వచ్చింది. సాధారణంగా దసరా తర్వాత సుమారు 20 రోజుల వ్యవధిలో దీపావళి వస్తుంది. అయితే ఈ ఏడాది దీపాల పండుగ అక్టోబర్ 31న వచ్చిందని కొందరు పండితులు చెబుతుంటే, మరికొందరు మాత్రం నవంబర్ 1న నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో 2024లో దీపావళి తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగ అక్టోబర్ 31న జరుపుకుంటుంటే.. కొన్ని ప్రాంతాల్లో మరుసటి రోజు నవంబర్ 1వ తేదీన కూడా లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు.
ఇక పాఠశాల విద్యార్థులకు దీపావళి పండగ సందర్భంగా వరుస సెలవులు రానున్నాయి. దసరా పండగకు దాదాపు 13 రోజుల పాటు సెలవులు ప్రకటించిన విద్యాసంస్థలు ఇప్పుడు దీపావళికి కూడా వరుస సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మళ్లీ మరో నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ గురువారం రానుంది. శుక్రవారం కూడా ఉత్తరాది రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. దీంతో ఏకంగా సోమవారం వరకు జమ్మూ వంటి రాష్ట్రాల్లో వరుసగా నాలుగు రోజులు స్కూళ్లకు సెలవు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణాలో ఇప్పటికే అక్టోబర్ 31న దీపావళి పండుగ సెలవు ప్రకటించారు. బ్యాంకులకు కూడా ఆరోజే సెలవు ఉంది. స్కూళ్లు కాలేజీలకు సెలవులు పొడగిస్తారా? లేదా చూడాలి.
అయితే, ఇప్పటికే భారీవర్షాలు వరదల నేపథ్యంలో గత నెల నుంచి భారీగా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత దసరా సెలవులు కూడా వచ్చాయి. ఇటీవల ఏపీలో వరదల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. తీరప్రాంత, వరద ప్రభావితం ప్రాంతాలకు సెలవులు వచ్చాయి. అయితే పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులో ఇప్పటికే దీపావళికి వరుసగా రెండు, నాలుగు రోజుల పాటు సెలువులు ప్రకటించారు. అక్కడ నాన్ స్టాప్‌గా కురుస్తున్న వర్షాలు కూడా ఇందుకు మరో కారణం. తమిళనాడు సర్కార్ నవంబర్ 1వ తేదీ సెలవును భర్తీ చేసేందుకు ప్రభుత్వం నవంబర్ 9వ తేదీని పని దినంగా ప్రకటించింది.