మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ

President Droupadi Murmu and PM Modi Pay Tributes To Mahatma Gandhi at Raj Ghat on His Death Anniversary,President Droupadi Murmu,PM Modi Pay Tributes,Tributes To Mahatma Gandhi,Mahatma Gandhi Death Anniversary,Mango News,Mango News Telugu,Father of the Nation,Mahatma Gandhi,Mahatma Gandhi Death Anniversary,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ రాజధానిలోని రాజ్‌ఘాట్‌ వద్ద ముందుగా రాష్ట్రపతి ముర్ము, ఆ తర్వాత ప్రధాని మోదీలు బాపూజీ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో సర్వ ధర్మ ప్రార్థన సభకు హాజరయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ కూడా మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఇక మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన వారిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. కాగా ఈరోజు, ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ‘నేను బాపు గారి పుణ్య తిథి నాడు ఆయనకు నమస్కరిస్తున్నాను, మరియు ఆయన లోతైన ఆలోచనలను స్మరించుకుంటున్నాను. అలాగే మన జాతి సేవలో అమరులైన వారందరికీ కూడా నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేము. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పని చేయాలనే మా సంకల్పాన్ని బలోపేతం చేస్తూనే ఉంటుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =