పోలింగ్ అయిపోగానే ఈవీఎంలను ఎక్కడికి తీసుకెళ్తారు?

Where will the EVMs be taken after the polling,Where will the EVMs be taken,EVMs be taken after the polling,EVMs be taken,EVM Strong Room, Assembly Elections 2023, District Election Officer,Head of the Election Commission,How are EVMs secured, EVM, Polling, BRS, BJP, Congress,Mango News,Mango News Telugu,EVM Latest News,EVM Latest Updates,Election Commission Live News,Telangana Latest News and Updates,Telangana Political News And Updates
EVM Strong Room, Assembly Elections 2023, District Election Officer,Head of the Election Commission,How are EVMs secured, EVM, polling, BRS, BJP, Congress

ఎన్నికలలో ఈవీఎంల పాత్ర చాలా కీలకం అని అందరికీ తెలిసిన విషయమే. ఏ ఎలక్షన్స్ జరిగినా ఈవీఎంలలో ఓటింగ్ జరిగాక వాటిని భద్రంగా తీసుకెళ్లి అంతే జాగ్రత్తగా భద్రపరుస్తారు. మిజోరాంలోని 40 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 8న  తొలి దశ ఓటింగ్  జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశతో పాటు తెలంగాణ,  మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత మొత్తం 5 రాష్ట్రాల ఓట్లను డిసెంబర్ 3న లెక్క పెట్టనున్నారు. అప్పటి వరకు  ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో జాగ్రత్తగా భద్రపరుస్తారు. అయితే  స్ట్రాంగ్ రూమ్ అంటే ఏంటి? ఈవీఎంలను ఎలా తీసుకెళతారు? ఎలా భద్రపరుస్తారనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతాయి.

నిజానికి ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక వెంటనే ఈవీఎంలను అధికారులు పోలింగ్ బూత్ నుంచి స్ట్రాంగ్ రూమ్‌కు పంపించరు. ప్రతీ ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్‌కు పంపడానికి ముందు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి.. ఈవీఎంలలోని ఓట్ల రికార్డును పరీక్షిస్తారు. ఆయన పరీక్షించిన తర్వాత అన్ని పార్టీల అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్‌లకు సర్టిఫైడ్ కాపీని అందజేశాక ఈవీఎంను సీలు చేస్తారు. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్లు సంతకాలను చేస్తారు. సంతకం చేసాక  అభ్యర్థులు కానీ లేదా వారి ప్రతినిధులు కానీ ఈవీఎంతో పాటు పోలింగ్ స్టేషన్ నుంచి స్ట్రాంగ్ రూమ్‌కు వెళతారు. అలా ఈవీఎంలన్నీ స్ట్రాంగ్‌రూమ్‌లోకి వచ్చిన తర్వాత అధికారులు వాటిని సీల్‌ చేస్తారు.

పోలింగ్ బూత్ నుంచి తీసుకొచ్చిన ఈవీఎంలను భద్రపరిచే గదినే స్ట్రాంగ్ రూమ్ అంటారు. ఈ  స్ట్రాంగ్‌రూమ్‌లకు ఎన్నికల సంఘం మూడు స్థాయిల్లో రక్షణను కల్పిస్తుంది. స్ట్రాంగ్ రూం లోపల.. కేంద్ర పారామిలటరీ బలగాలతో భద్రతను ఏర్పాటు చేస్తుంది.అంతేకాదు లోపలే రెండో అంచె భద్రత కూడా ఉంటుంది. ఇక్కడ కూడా సెంట్రల్ ఫోర్స్ సిబ్బందే  ఉంటారు. అలాగే మూడు అంచెల భద్రత బయట ఉంటుంది. దీనిలో ఆయా రాష్ట్ర పోలీసు బలగాలకు చెందిన వారు కాపలాగా ఉంటారు.

అలా పోలింగ్ జరిగిన రోజు సీల్ చేసిన ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ను సీల్ చేసి..తిరిగి కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే తెరుస్తారు.అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు లేదా అత్యవసర పరిస్థితుల్లో, స్ట్రాంగ్ రూమ్ తెరుస్తారు. అదికూడా అభ్యర్థులు ఎదుటే  తెరుస్తారు తప్ప వారు లేకుండా తెరవరు. అలాగే  ఎన్నికలకు ముందు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈవీఎంలను గోదాములలో ఉంచుతారు. ఈ గోదాములో ఈవీఎంల భద్రత కోసం భారీగా కేంద్ర బలగాలు మోహరించి ఉంటారు.  అంతే కాకుండా సీసీటీవీల ద్వారా కూడా ఈవీఎంలపై నిఘా ఉంచుతారు. ఎన్నికల ముందు ఏ ఈవీఎంలను కూడా  హెడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్  ఆదేశం లేకుండా బయటకు తీసుకురావడానికి  వీల్లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + twelve =