వెస్ట్ బెంగాల్‌లో డ్యూటీలో ఉన్న ఓ మహిళా ఏఎస్సై ప్రవర్తించిన తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది. సిరిగురిలోని వార్డు నంబర్ 46లో ఉన్న ఓ స్కూల్ గ్రౌండ్‌లో ఇద్దరు మైనర్‌లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అటువైపుగా వెళ్తున్న పింక్ మొబైల్ పెట్రోలింగ్ పోలీస్ వ్యాస్ వారి వద్ద ఆగింది. అందులోంచి దిగిన ఓ మహిళా పోలీసు అధికారి వారిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో స్థానిక నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్యూటీ సమయంలో ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి వారు పోలీసు సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్లను ప్రశ్నించకుండా దుర్భాషలాడారని ఆరోపించారు. మైనర్ తల్లి కూడా తన కుమార్తె, ఆమె స్నేహితుడిపై అన్యాయంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, డ్యూటీలో ఉన్న మహిళా ఏఎస్సై మద్యం మత్తులో ఉన్నారని ఆరోపించారు.
మద్యం సేవించారా అని ప్రశ్నించినందుకు నడిరోడ్డుపై ఓ మైనర్ బాలికకు లిప్ కిస్ పెట్టడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సబ్ ఇన్‌స్పెక్టర్ తనియా రాయ్ ను ఓ మైనర్ బాలికను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మీ దగ్గర మద్యం వాసన వస్తోంది మేడమ్.. దూరంగా ఉండండి.. అని ఆ బాలిక అనడంతో పోలీసు అధికారికి కోపం వచ్చింది. వంటనే, ఒట్టు నేను తాగలేదు.. కావాలంటే చూడూ అని ఓ బాలికకు నడిరోడ్డుపై లిప్ కిస్ ఇచ్చింది.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఇప్పటికే సదరు మహిళా అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆమెపై శాఖా పరమైన విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విధులు నిర్వహించే సమయంలో ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని స్పష్టం చేశారు. దింతో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారిపోయింది.