డిసెంబరు 1 నుంచి ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలను కనిష్ఠంగా 10% నుండి గరిష్ఠంగా 20% వరకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విలువలు వాస్తవికతకు దూరంగా ఉంటే, వాటిని తగ్గించనున్నామని అధికారులు తెలిపారు. ‘కారిడార్ గ్రోత్, జాతీయ రహదారులు, ఇతర అభివృద్ధి అంశాల ఆధారంగా విలువలను ఖరారుచేస్తాం’ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ప్రత్యేక కమిటీలు ఆయా ప్రాంతాల్లోని సర్వే నంబర్లు, దస్తావేజుల రిజిస్ట్రేషన్ వంటి వివరాలను పరిశీలిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన విధానాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త మార్పులు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని ఆయన చెప్పారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.10,005 కోట్ల ఆదాయం అందింది, ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు 24 వరకు రూ.5,235.31 కోట్ల ఆదాయం నమోదైంది.
కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 20 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ విలువలు వాస్తవికతకు దూరంగా ఉంటే తగ్గిస్తారు. కారిడార్ గ్రోత్, జాతీయ రహదారులు, ఇతర అంశాల ప్రతిపాదికన విలువలు ఖరారుచేస్తామని రెవెన్యుమంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని సర్వే నంబర్లు, వాటి పరిధి, జరిగిన అభివృద్ధి, దస్తావేజుల రిజిస్ట్రేషన్, ఇతర వివరాలను ప్రత్యేక కమిటీలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. గత సర్కార్‌లో మాదిరిగా కాకుండా విలువల పెంపు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్లు ఉంటుందన్నారు. 2023-24లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.10,005 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 24 వరకు రూ.5,235.31 కోట్ల ఆదాయం వచ్చిందని అనగాని సత్యప్రసాద్ వివరించారు.
మరోవైపు ఏపీలో కొన్ని గ్రామాల్లోనే రీ-సర్వే పూర్తయింది. మిగిలిన గ్రామాల్లో సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సెక్రటేరియట్లో జరిగిన మంత్రుల భేటీలో ఆర్థికశాఖ అధికారులతోపాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు పాల్గొన్నారు. రెండువారాల్లో మరో అధికారిక సమావేశం జరగబోతుంది. ఆ భేటీలో విలువల పెంపుపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.
స్టాంపు పేపర్లకు ఇక కొరత లేదు : గతంలోలాగే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపు పేపర్లను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ-స్టాంపింగ్‌తో పాటు స్టాంపుపేపర్ల ద్వారా రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తామని చెప్పారు. రూ.50, రూ.100 విలువ కలిగిన పదేసి లక్షల స్టాంపు పేపర్ల చొప్పున సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతున్నామని వివరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్వహణలో క్రయ, విక్రయదారుల సౌకర్యార్థం సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు అనగాని వెల్లడించారు.