ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా విడుదలైంది. ఫ్రాంచైజీలు ఒక్కొక్కటిగా తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఆశ్చర్యకరంగా, ఫ్రాంచైజీలు కొంతమంది ప్రముఖ ఆటగాళ్లను వదులుకోగా, మరికొందరు అధిక ధరకు ఉంచుకున్నారు.
ముఖ్యంగా, ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు కెప్టెన్ మరియు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను విడిచిపెట్టింది. కేఎల్ రాహుల్ విషయంలో లక్నో సూపర్‌జెయింట్స్ కూడా ఇదే వైఖరిని తీసుకుంది. గత సారి చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను రిటైన్ చేయలేదు. ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన నిర్ణయాలను టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ 2025 కోసం సిద్ధమయ్యే 10 ఫ్రాంచైజీలు ఇవాళ అక్టోబర్ 31లోగా ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదల చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గరిష్టంగా ఆరుమందిని ఉంచుకోవచ్చు. అదే విధంగా మొత్తం ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఎవరిని ఎంతకు రిటైన్ చేసుకున్నాయో, ఇంకా ఎంత మిగిలిందో వెల్లడించాయి.
ఈసారి వేలంలో అత్యధికంగా 110.5 కోట్లతో పంజాబ్ సూపర్ కింగ్స్ బరిలో దిగనుంది. ఆ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 83 కోట్లతో వేలంలో పాల్గొననుంది. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 55 కోట్లు, ముంబై ఇండియన్స్ 45 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ 76.25 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ 63 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ 69 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 45 కోట్లు, గుజరాత్ టైటాన్స్ 69 కోట్లు, ఇక అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ 41 కోట్లతో వేలంలో పాల్గొననుంది.
క్లాసెన్ అదుర్స్
రిటెన్షన్‌లో అత్యధిక ధర పలికిన ప్లేయర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్లు కాగా రెండు మూడు స్థానాల్లో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ 21 కోట్లతో ఉన్నారు. ఈసారి జరగనున్న ఆక్షన్‌లో ఐపీఎల్ మెగా ప్లేయర్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమిలు వేలంలో కన్పించనున్నారు. మరి ఈ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ ఎంతకు దక్కించుకుంటుందో చూడాలి.
రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా
1. గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్-రూ. 16.5 కోట్లు, రషీద్ ఖాన్-రూ. 18 కోట్లు, సాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లు, రాహుల్ తెవాటియా-రూ. 4 కోట్లు, షారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లు
2. లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్-రూ. 21 కోట్లు, రవి బిష్ణోయ్-రూ. 11 కోట్లు, మయాంక్ యాదవ్-రూ. 11 కోట్లు, మోహ్సిన్ ఖాన్- రూ. 4 కోట్లు, ఆయుష్ బదోని-రూ. 4 కోట్లు
3. ముంబై ఇండియన్స్: జస్ప్రీత్ బుమ్రా 18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ.16.35 కోట్లు, రోహిత్ శర్మ రూ.16.30 కోట్లు, తిలక్ వర్మకు రూ.8 కోట్లు
4.చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా – రూ. 18 కోట్ల, రుతురాజ్ గైక్వాడ్ – రూ. 18 కోట్ల, శివమ్ దూబే – రూ. 12 కోట్ల, మతీశ పతిరానా – రూ. 13 కోట్ల, ఎం ఎస్ ధోని – రూ. 4 కోట్ల
5. సన్‌రైజర్స్ హైదరాబాద్: హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు, ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు, అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు, ట్రావిస్ హెడ్- రూ. 14 కోట్లు, నితీశ్ కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లు
6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ- రూ. 21 కోట్లు, రజత్ పటీదార్-రూ. 11 కోట్లు, యశ్ దయాల్-రూ. 5 కోట్లు,
7.ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్-రూ. 16.5 కోట్లు, కుల్దీప్ యాదవ్-రూ. 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్-రూ. 10 కోట్లు, అభిషేక్ పోరెల్-రూ. 4 కోట్లు
8.కేకేఆర్”: రింకూ సింగ్-రూ. 13 కోట్లు, వరుణ్ చక్రవర్తీ- రూ. 12 కోట్లు, సునీల్ నరైన్-రూ. 12 కోట్లు, ఆండ్రీ రస్సెల్-రూ. 12 కోట్లు, హర్షిత్ రాణా-రూ. 4 కోట్లు, రమణ్‌దీప్ సింగ్-రూ. 4 కోట్లు
9. పంజాబ్ కింగ్స్: శశాంక్ సింగ్-రూ. 5.5 కోట్లు, ప్రభ్సిమ్రాన్ సింగ్- రూ. 4 కోట్లు,
10. రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్-రూ. 18 కోట్లు, యశస్వి జైస్వాల్-రూ. 18 కోట్లు, రియాన్ పరాగ్-రూ. 14 కోట్లు, ధ్రువ్ జురెల్-రూ. 14 కోట్లు, షిమ్రాన్ హెట్‌మైర్-రూ. 11 కోట్లు, సందీప్ శర్మ-రూ. 4 కోట్లు