కృనాల్‌ పాండ్యాకు కరోనా పాజిటివ్, భారత్-శ్రీలంక రెండో టీ20 వాయిదా

2nd T20I Postponed, cricket, India vs Sri Lanka, India vs Sri Lanka 2nd T20 postponed, Indian player tests positive for COVID-19, Krunal Pandya, Krunal Pandya Tested Positive, Krunal Pandya Tests Positive For Covid, Krunal Pandya tests positive for COVID-19, Mango News, Player Krunal Pandya Tested Positive for Covid-19, Second Sri Lanka-India T20I postponed after Krunal Pandya Tests Positive, Second Sri Lanka-India T20I Postponed to July 28, second T20I, Sri Lanka vs India

భారత్, శ్రీలంక జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 25న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక భారత కాలమానం ప్రకారం జూలై 27, మంగళవారం రాత్రి 8 గంటల నుంచి రెండో టీ20 జరగాల్సి ఉంది. కాగా భారత యువ క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో రెండో టీ20ను జూలై 28కి వాయిదా వేయబడిందని బీసీసీఐ ప్రకటించింది. అలాగే జట్టులో ఇంకా ఎవరికైనా కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి మొత్తం బృందానికి ఈ రోజు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ వెల్లడించింది.

మరోవైపు ఈ పర్యటనలో భాగంగా ముందుగా జరిగిన 3 వన్డేల సిరీస్ ను భారత్ జట్టు 2-1 తో గెలుచుకుంది. మొదటి రెండు వన్డేలను శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ భారత్ జట్టు గెలుచుకోగా, మూడో వన్డేను శ్రీలంక గెలుచుకుంది. భారత జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉన్న నేపథ్యంలో ఈ వన్డే, టీ20 సిరీస్ ల కోసం కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో యువకులతో కూడిన భారత్ జట్టు శ్రీలంక వెళ్ళింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 6 =