బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే పది వారాలు పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేసింది. ఇక పదకొండో వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చెప్తూ సోమవారం వచ్చిన ప్రోమోలో నామినేషన్ రచ్చను బయటకు తీసుకువచ్చింది. దీనిలో రెండు నామినేషన్లు హైలైట్ గా నిలిచాయి. ఈ వారం నామినేషన్ల ప్రక్రయలో హౌస్ మేట్స్ ముందు పెయింటింగ్స్ ఉంటాయి. తాము నామినేట్ చేయాలనుకుంటున్న వారిపై పెయింటింగ్‌పై నామినేషన్ కు రీజన్ చెబుతూ రంగు పూయాలి.
టేస్టీ తేజను నిఖిల్ నామినేట్ చేస్తూ తన రీజన్ చెప్పాడు. ఒక చిన్న డిస్ రెస్పెక్ట్ చేసినందుకే తేజ తనను నామినేట్ చేశాడుని..కానీ తను బిగ్‌బాస్ రూల్‌నే బ్రేక్ చేశాడు అంటూ నిఖిల్ చెబుతాడు. దీనికి డిఫెండ్ చేసుకుంటూ అది ఇంట్లో నుంచి పరిగెత్తి బయటికెళ్లిపోయేంత తప్పు కాదనేది తన ఉద్దేశమన్నట్లుగా చెప్తాడు.
సరే తనది తప్పు బ్రో అన్న తేజ.. మరి తర్వాత జరిగింది తప్పా కాదా అంటూ యష్మీ ఇష్యూను లేవనెత్తుతాడు. దీనికి నిఖిల్ కు ఏం చెప్పాలో తెలీక నువ్వు చేసిన తర్వాత ఆమె చేసిందా.. ఆమెనే అడుగు అయితే అంటూ నిఖిల్ తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కానీ తేజ వదలకుండా నిఖిల్ కు మాట్లాడటాని కి భయమని..అది తప్పా కాదా చెప్పు అంటూ రెచ్చగొడతాడు.
దీనికి తానను చెప్పా అంటూ నిఖిల్ అడ్డంగా వాదిస్తాడు. భయం లేకపోతే మరెందుకు చెప్పవంటూ తేజ అంటే..అతనిదే తప్పు అంటూ నిఖిల్ అరుస్తాడు. వీరిద్దరితో పాటు మరో నామినేషన్ కూడా ఈ ఎపిసోడ్ లో హైలైట్ అయ్యింది. గౌతమ్‌ను నామినేట్ చేసిన ప్రేరణ.. మొత్తం బయటి ప్రపంచాన్నే మైండ్‌లో పెట్టుకొని గౌతమ్ ఆడినట్లుందని.. తనకి క్లారిటీ అనేది ఎక్కువ లేదని చెబుతుంది. దీంతో ఎప్పటిలానే గౌతమ్ రెచ్చిపోతాడు.
ఒక మనిషికి బ్రాండింగ్ వేయడమనేది డిస్ రెస్పెక్ట్ అన్న గౌతమ్.. అవమానానికి. ఆచరించకపోవడానికి చాలా తేడా ఉందంటాడు. ప్రతి దానికి కూడా నువ్వు తప్పు చేసినవ్ నీ వల్లే ఓడిపోయినవ్ నీ వల్లే ఓడిపోయినవ్ అని గుచ్చి గుచ్చి చెప్పడం టీమ్మేట్ల లక్షణం కాదని అంటాడు. ముఖ్యంగా మెగా చీఫ్ లక్షణం కాదంటూ గౌతమ్ సీరియస్ అవుతాడు. మొత్తంగా నామినేషన్ల ప్రక్రియ ఎప్పటిలాగే గరంగరంగా సాగింది.