మద్యం విక్రయ కేంద్రాల్లో వయసు నిర్ధారణను కఠినంగా అమలు చేయడం కోసం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ‘కమ్యూనిటీ ఎగెయిన్‌స్ట డ్రంకెన్ డ్రైవింగ్’ (CADD) అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ప్రస్తుతం భారత్‌లో యువతలో మద్యం సేవించే అలవాటు పెరిగిపోతుండడంతో, అనేక యువత ఆల్కహాల్ ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నట్టు నివేదికలు వెల్లడయ్యాయి. దాని ప్రభావం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో అధిక ప్రమదాలు జరుగుతున్నాయి. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మద్యం విక్రయ కేంద్రాల వద్ద వయసు నిర్ధారణకు సంబంధించి పటిష్ట విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వయసు నిర్ధారణ విధానం:
పిటిషన్‌లో, మద్యం విక్రయ కేంద్రాల వద్ద మద్యం కొనుగోలుదారుల వయస్సును కచ్చితంగా నిర్ధారించాలి. మద్యం కొనుగోలు చేసే వారి వయస్సు 18-25 సంవత్సరాల మధ్య మారిపోతున్నందున, ఫోటో ఐడెంటిటీ కార్డును చూపించడం ద్వారా వినియోగదారుల వయసు నిర్ధారించాలని సూచించారు.
ఇంకా, మద్యం దుకాణాలు మరియు బార్లలో ఏజ్ చెకింగ్/వెరిఫికేషన్ వ్యవస్థను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది సుప్రీం. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన CADD సంస్థ, 25 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మద్యం కొనుగోలు చేస్తే వారిపై రూ. 10,000 జరిమానా విధించాలన్న సిఫారసును చేసింది.
పిటిషన్ లో ప్రధాన సూచనలు:
- వయసు నిర్ధారణ కోసం పటిష్ట విధానం: మద్యం విక్రయ కేంద్రాలు లేదా బార్లలో 25 ఏళ్ల కంటే తక్కువ వయసు గలవారికి పటిష్ట వయసు నిర్ధారణ విధానాలు అమలు చేయాలని, ఫోటో ఐడెంటిటీ కార్డుల ఆధారంగా వయసు నిర్ధారణ చేయాలని సూచించారు.
- జరిమానా విధించడం: మైనర్లు, వయసు నిర్ధారణ లేకుండా మద్యం కొనుగోలు చేసినా వారి పై రూ.10,000 జరిమానా విధించడం.
- మద్యం డెలివరీ: ఇంటి వద్దకే మద్యం డెలివరీ (Doorstep delivery) వల్ల, చిన్న వయసు వారు సులభంగా ఆల్కహాల్ పొందే అవకాశాలు ఉంటుంది. దీంతో, మద్యం వ్యసనం పెరిగే అవకాశం ఉంది.
- కఠిన చర్యలు: ఏజ్ వెరిఫికేషన్ నిబంధనలను ఉల్లంఘించిన వైన్ షాప్‌లపై రూ.50,000 జరిమానా విధించాలి, అలాగే వారి లైసెన్స్ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.
సుప్రీం కోర్టు ఆదేశాల:
ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, కోర్టు తాలూకు న్యాయమూర్తులు BR గవాయి మరియు KV విశ్వనాథన్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఈ సమస్యను పూర్తిగా అరికట్టడం కష్టమని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇతర దేశాల్లో అనేక కఠిన చర్యలు అమలులో ఉన్నాయని, వాటిని భారతదేశంలో కూడా అమలు చేయవచ్చని CADD సంస్థ తరఫున వాదించిన లాయర్ కోర్టుకు వివరించారు. కోర్టు ఈ వాదనను పరిగణనలోకి తీసుకుని, సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
భవిష్యత్ కార్యాచరణ:
ఈ అంశంపై మరింత విచారణ జరపాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ సమస్యకు చెక్ పెట్టడం కోసం మద్యం విక్రయ కేంద్రాలలో పటిష్ట వయసు నిర్ధారణ విధానాన్ని అమలు చేయడం చాలా ముఖ్యం. CADD సంస్థ, కోర్టు వద్ద దీన్ని పటిష్టంగా అమలు చేయాలని, మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతోంది.