మహిళల రక్షణ గురించి ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయస్థానాలు ఎన్ని రకాల చట్టాలు తీసుకువచ్చినా సరే నేరాలు అదుపులోకి రావడం లేదు. మహిళల అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు సరికదా..ఇంకా పెరిగిపోతున్నాయి. అయితే తమపై అఘాయిత్యం జరిగితే చాలామంది పరువు పోతుందని నాలుగు గోడల మధ్య కుమిలిపోతుంతే..మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రమే ధైర్యం చేసి కొందరు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
తాజాగా ఏపీలో జరిగిన దారుణంలోనూ ఇదే సీన్ కనిపించింది.ఒక న్యాయ విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం జరిగింది.అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు ఆమెను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి పలుసార్లు బెదిరింపులకు దిగి పదే పదే అఘాయిత్యానికి పాల్పడటంతో..చివరకు ఏం చేయాలో తెలియక బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది.
విశాఖలో లా కాలేజీలో బిఎల్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ యువతికి తనతోటి విద్యార్థితో పరిచయం ఏర్పడింది.తర్వాత పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన ఆ యువకుడు శారీరకంగా ఆమెతో కలిశాడు. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు తీసుకువెళ్లి అక్కడ ఆమెపై శారీరకంగా కలిసాడు. అంతటితో ఆగకుండా అదే నెలలో తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి బాధితురాలితో మరోసారి కలిసాడు.
అయితే ఇదంతా వీడియో తీసిన అతని స్నేహితులు ముగ్గురు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దానిని కూడా వీడియో తీసిన నిందితులు బెదిరిస్తూ ఆమెపై చాలాసార్లు అత్యాచారం చేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు సహ విద్యార్ధులు కాగా.. మరొకరు ప్రైవట్ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. కానీ రోజురోజుకు ఈ వేధింపులు ఎక్కువవడంతో బాధితురాలు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో అది గమనించిన ఆమె తండ్రి రక్షించి గట్టిగా అడిగేసరికి అసలు విషయం బయట పెట్టింది. వెంటనే ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించారు.
దీనిపై కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు ఆ నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మరోవైపు విశాఖలో జరిగిన ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. విశాఖ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.