ఆంధ్రప్రదేశ్ లో 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటు

2019 Latest Telugu Movie News, Andhra Pradesh Political News, AP Govt Issued Orders Over Establishment Of Village Secretariat, AP Village Secretariat Recruitment 2019, Committee to look into village secretariat set up, Village Secretariat system to start functioning in AP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగమైన యువత- ఉపాధి కింద ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న రాష్ట్ర ప్రభుత్వం 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది, ఒక్కో గ్రామ సచివాలయానికి 10 మంది ని ఉద్యోగులుగా నియమించేందుకు ఆదేశాలు జారీ చేసారు. రెండు వేల జనాభా నుంచి నాలుగు వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయితీలను ఒక సచివాలయంగా పరిగణిస్తారు. నాలుగు వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలలో ఒకటి లేదా రెండు సచివాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తక్కువ జనాభా గల గ్రామ పంచాయితీలను మరో దానితో కలిపి ఒక సచివాలయంగా అందుబాటులోకి తెస్తారు.

గ్రామ సచివాయం లో ఉద్యోగాల నియామక పక్రియతో పాటు, మరి కొన్ని ప్రభుత్వ ఖాళీలను కలుపుకొని కొత్తగా 91,652 ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి శుక్రవారం నాడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులకు జారీచేసింది. జూలై 23 నుంచి సెప్టెంబర్ 14 మధ్య ఉద్యోగ నియామకాలు చేపట్టి, సెప్టెంబర్ లో ఎంపికైన ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. సెప్టెంబర్ 30 కల్లా గ్రామసచివాలయాలు ఏర్పాటు పూర్తిచేసి, ఉద్యోగులను కేటాయించి అక్టోబర్ 2 నుండి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు.

 

[subscribe]
[youtube_video videoid=ulew8-W91vQ]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + thirteen =