ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

AP Formation Day Celebrations held at CM Camp Office CM YS Jagan Hoists National Flag, Andhra Pradesh Formation Day, CM Jagan Inaugurated National Flag, AP Formation Day, Mango News, Mango News Telugu, Hon'ble CM Unfurls National Flag, Formation Day Celebrations, CM Jagan Hoists National Flag, AP Formation Day 2022, AP Formation Day 2022 Latest News And Updates, Andhra Pradesh Formation, AP Formation Day 1 November 1956, AP Formation Day, AP Formation Day Latest News And Updates

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్‌ 1న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా సీఎం వైఎస్ జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, ఆర్కే రోజా సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ, “మన సంస్కృతిని-మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను-విజయాలను, ఈ నేలపై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eight =