తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్ బాబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సియోల్‌లో చేసిన ప్రకటనతో అంతా ఏం జరుగుతుందోనని వెయిట్ చేశారు. అయితే దీపావళి వచ్చి.. వెళ్లిపోయింది కానీ ఎలాంటి బాంబులు పేలలేదు. ఫాంహౌస్ అంశం కాస్త హల్‌చల్ చేసినా. లగచలర్ల ఘటన సెన్సేషన్ క్రియేట్ చేసినా అన్నీ మెల్లగా చల్లబడ్డాయి.
రేపోమాపో కేటీఆర్ అరెస్టు అవుతారంటూ అధికార పార్టీ నేతలు లీకులు ఇస్తుండటంతో..బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. దీంతో స్పందించిన కేటీఆర్ .. అరెస్టు చేసుకోండి.. అరెస్టు చేస్తే మూడు నెలలు జైల్లో ఉంటా.. యోగా చేసుకుంటా.. రెస్టు తీసుకుని బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానని కామెంట్లు చేశారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఐదారు కేసులు నమోదవగా..అవన్నీ పిటీ కేసులే. ఒక్క ఫార్ములా -1 రేసు కేసు మాత్రమే కాస్త గట్టిది. ఈ కేసులో ఫారిన్ సంస్థకు అనుమతి లేకుండా 55 కోట్లు రూపాయలు కేటాయించారు. దీనిని కేటీఆర్ కూడా అంగీకరించడంతో.. దీనిపై ఈడీ వివరాలు కోరింది. కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కూడా గవర్నర్‌కు లేఖ రాసింది. దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయమని గట్టిగా వార్తలు వినిపించడంతో.. కేటీఆర్ కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధం అంటూ ప్రకటన కూడా చేశారు.
కానీ కేటీఆర్‌ను విచారణ చేయాలని ఏసీబీ రాసిన లేఖపై..ఇప్పటి వరకూ కూడా గవర్నర్ స్పందించలేదు. ఎలాంటి అనుమతి కూడా రాలేదు. ఇటు మొన్నటి వరకూ దూకుడు ప్రదర్శించిన కేటీఆర్.. ఢిల్లీ వెళ్లొచ్చాక సైలంటయ్యారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్ అరెస్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణ అనుమతి కోసం గవర్నర్‌పై రేవంత్ రెడ్డి ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదట. ఫార్ములా ఈ రేసు కేసులో 55 కోట్లు రూపాయలు కేటాయించినట్లు కేటీఆర్ అంగీకరించినా కూడా..ఆయన అరెస్టుకు మాత్రం ముందుకు రావడం లేదు. అవినీతి కేసుల్లో కూడా ఏడాదిగా విచారణ చేస్తున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కేటీఆరే కీలకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా కూడా కేటీఆర్ అరెస్టు విషయంలో ఎందుకో.. రేవంత్‌రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.