అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి నటుల అద్భుతమైన నటనతో ఈ చిత్రం ప్రదర్శన అంచనాలకు మించి సక్సెస్ సాధించింది.
నైజాంలో ఆల్ టైమ్ రికార్డు:
ఫస్ట్ డే నైజాంలో ఈ చిత్రం రూ. 25 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2, ఒక్క రోజు లోనే రూ. 300 కోట్లకు దగ్గరగా వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమాకు కొత్త మైలురాయిని చేరువ చేసింది.
బాలీవుడ్‌కు ఢీ కొట్టిన పుష్ప 2:
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ “జవాన్” రికార్డును బద్దలుకొడుతూ, పుష్ప 2 నార్త్ ఇండియాలో హిందీ డబ్బింగ్ వెర్షన్‌తో మొదటి రోజు రూ. 72.05 కోట్ల కలెక్షన్ సాధించి, హిందీయేతర హీరోగా అరుదైన రికార్డు సృష్టించాడు.
ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సంచలనం:
రిలీజ్‌కు ముందే ఈ చిత్రం రూ. 617 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌తో రూ. 275 కోట్ల డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కింద రూ. 85 కోట్లు, మ్యూజిక్ రైట్స్ కింద రూ. 65 కోట్లతో బిజినెస్ చేసిన పుష్ప 2, భాషల గడ్డు అవరోధాలను దాటి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ప్రేక్షకులను కట్టిపడేసిన ఎలెమెంట్స్:
ఈ చిత్రంలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. హిందీ, తెలుగు భాషల్లో ఒకేరోజు రూ. 50 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
పుష్ప 2, కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిష్టను పెంచిన చిత్రం అని చెప్పొచ్చు.
MIGHTY 8 – *Day 1* biz…
⭐️ #Pushpa2 #Hindi: ₹ 72 cr
⭐️ #Jawan: ₹ 65.50 cr
⭐️ #Stree2: ₹ 55.40 cr [doesn't include previews]
⭐️ #Pathaan: ₹ 55 cr
⭐️ #Animal: ₹ 54.75 cr
⭐️ #KGF2 #Hindi: ₹ 53.95 cr
⭐️ #War: ₹ 51.60 cr
⭐️ #TOH: ₹ 50.75 cr
NOTE: Above ₹ 50 cr openers only.… pic.twitter.com/7CGS2Dtwxb— taran adarsh (@taran_adarsh) December 6, 2024