ఆర్టిస్ట్స్ రెమ్యూనరేషన్స్, ఓటీటీలపై కొత్త మార్గదర్శకాలు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన

Telugu Film Chamber Of Commerce Announces New Guidelines on Artists Payments OTT Release, Telugu Film Chamber Sets New Guidelines, Telugu Film Chamber Of Commerce on Artists Payments , Telugu Film Chamber Of Commerce, OTT Release, Mango News, Mango News Telugu, Telugu Film Chamber Guidelines, Telugu Film Chamber OTT Release, Telugu Film Chamber Of Commerce, New Guidelines on Artists Payments, New Guidelines on OTT Release, TFCC, Tollywood News And Live Updates

తెలుగు సినిమా పరిశ్రమలో(టాలీవుడ్) కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. పరిశ్రమలో నటీనటుల రెమ్యూనరేషన్స్, కాల్‌ షీట్లు వివరాలు, ఓటీటీ, శాటిలైట్‌ హక్కులుపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. సినీ పరిశ్రమలో నెలకున్న సమస్యలపై పరిశ్రమకు సంబంధించిన అందరూ వాటాదారులు మరియు థర్డ్ పార్టీలతో విస్తృతమైన చర్చలు/సమావేశాల తర్వాత, తీసుకున్న నిర్ణయాలను సెప్టెంబర్ 10, 2022 నుండి అమలు చేయడానికి అందరూ అంగీకరించారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది.

టాలీవుడ్ లో అమల్లోకి రానున్న కొత్త మార్గదర్శకాలు ఇవే:

సినిమాల నిర్మాణం:

  • ఆర్టిస్ట్స్/నటీనటులు/టెక్నీషియన్‌లకు పర్ డే/రోజువారీగా చెల్లింపులు ఉండవు.
  • ఇకపై నటీనటుల వేతనాలు వారి సిబ్బంది, స్థానిక రవాణా, స్థానిక వసతి, ప్రత్యేక ఆహారం మొదలైనవి కలిపే ఉంటాయి.
  • పాత్ర లేదా చిత్రం ఆధారంగా ఇచ్చే మొత్తాన్ని నిర్మాత ఖరారు చేస్తారు.
  • నిర్మాత స్వయంగా ఆర్టిస్ట్‌కు అంగీకరించిన మొత్తం తప్ప ఆర్టిస్ట్ కు సంబంధించిన ఇతర ఎలాంటి మొత్తాలను నేరుగా చెల్లించకూడదు.
  • అలాగే అందరూ చీఫ్ టెక్నీషియన్ల వేతనాలు కూడా సిబ్బంది, స్థానిక వసతి, స్థానిక రవాణా, ప్రత్యేక ఆహారం మొదలైన వాటితో కలిపే ఖరారు చేయబడతాయి.
  • టెక్నీషియన్‌కు అంగీకరించిన మొత్తం తప్ప, టెక్నీషియన్‌కు సంబంధించిన ఏ మొత్తాలను నిర్మాత నేరుగా చెల్లించకూడదు.
  • సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు అన్ని ఒప్పందాలు ఫీజు వివరాలతో తప్పనిసరిగా నమోదు చేయాలి. అన్ని ఒప్పందాలు ఛాంబర్ ద్వారా ధృవీకరించబడాలి.
  • క్రమశిక్షణ/కాల్ షీట్ సమయాలను కఠినంగా అమలు చేయడం.
  • నిర్మాత ప్రయోజనం కోసం రోజువారీ షూటింగ్ నివేదికను నిర్వహించాలి.

ఓటీటీ:

  • సినిమా టైటిల్స్/థియేట్రికల్ రిలీజ్ పబ్లిసిటీలో ఓటీటీ మరియు శాటిలైట్ భాగస్వాముల పేర్లు వేయకూడదు/ఉంచకూడదు.
  • ఓటీటీ విత్‌హోల్డ్ విండో కనీసం 8 వారాలు, ఇకపై విడుదల చేసే సినిమాలను తప్పనిసరిగా 8 వారాల తర్వాతే ఓటీటీకీ ఇవ్వాలి.

థియేట్రికల్/ఎగ్జిబిషన్:

  • వీపీఎఫ్ చర్చలు కొనసాగుతున్నాయి, తదుపరి సమావేశం సెప్టెంబర్ 3న నిర్ణయించబడింది, కానీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్‌లచే సెప్టెంబర్ 6కి వాయిదా వేయబడింది, మరియు తదనుగుణంగా వీపీఎఫ్ చార్జీలపై వివరాలు తెలియజేయబడతాయి.
  • ఆంధ్రా మల్టీప్లెక్స్‌లలో కూడా తెలంగాణలో ఇచ్చే పర్సెంటేజ్ నే ఇవ్వాలి.

ఫెడరేషన్:

  • తుది చర్చలు జరుగుతున్నాయి. ఆమోదించబడిన మరియు ఖరారు చేయబడిన రేట్ కార్డ్‌లు ధృవీకరించబడిన తర్వాత అన్ని ప్రొడక్షన్ హౌస్‌లకు తెలియచేయబడతాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − one =