ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేంద్రీయ విద్యాలయాలు
చిత్తూరు జిల్లా: వలసపల్లె
శ్రీ సత్యసాయి జిల్లా: పాలసముద్రం
గుంటూరు జిల్లా: తాళ్లపల్లె, రొంపిచర్ల
కృష్ణా జిల్లా: నందిగామ
ఏలూరు జిల్లా: నూజీవీడు
నంద్యాల జిల్లా: డోన్
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాలు
జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేట.
ప్రాధాన్యతా విద్యా అభివృద్ధి
ఈ కేంద్రీయ మరియు నవోదయ విద్యాలయాల ద్వారా దేశవ్యాప్తంగా 82,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం రూ. 5,872.08 కోట్ల వ్యయాన్ని 2025-26 నాటికి ఖర్చుచేయనున్నారు.
దేశానికి మెట్రో కనెక్టివిటీ బూస్ట్
కేంద్రం ఢిల్లీ మెట్రో నాలుగో దశ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిథాలా-కుండలి కారిడార్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా 26.468 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణానికి రూ. 6,230 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. దీని ద్వారా ఢిల్లీ-హర్యానాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుంది.