గతంలో వర్షాకాలంలో మాత్రమే పడే వర్షాలు ఇప్పుడు కాలంతో పని లేకండా పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీని వర్షాలు వీడటం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు వల్ల ఏర్పడుతున్న తుఫాన్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నాయి. అయితే తాజాగా ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు అప్డేట్ ఇచ్చారు.
హిందూ మహాసముద్రం, పక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇకపోతే శనివారానికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతూ..డిసెంబర్ 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇలా అభివృద్ధి చెందుతున్న వాతావరణ నమూనా వల్ల, డిసెంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.అదే విధంగా డిసెంబర్ 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.మరోవైపు అల్పపీడన ప్రభావంతో..ఈరోజువిశాఖపట్నం, అనకాపల్లి , శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అల్పపీడన ప్రాంతం కాస్తా..తర్వాత తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంటుంవదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత.. దీనిపై క్లారిటీ రానుందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.