తరాల తలరాతలు మారాలన్నా.. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా విద్యతోనే సాధ్యం – సీఎం జగన్

CM YS Jagan Released Rs.703 Cr Funds For 9.95 Lakh Students Under Jagananna Vidya Deevena in Kovvur Today,CM YS Jagan Released Rs.703 Cr Funds,CM YS Jagan Funds For 9.95 Lakh Students,Jagananna Vidya Deevena,Jagananna Vidya Deevena in Kovvur Today,Mango News,Mango News Telugu,Disbursement of Jagananna Vidya Deevena,Jagananna Vidya Deevena Funds Released,703 Cr Funds Under Jagananna Vidya Deevena,CM YS Jagan Latest News,CM YS Jagan Latest Updates,CM YS Jagan Live News,Jagananna Vidya Deevena Latest News,Jagananna Vidya Deevena Latest Updates,Jagananna Vidya Deevena Live News,Jagananna Vidya Deevena Funds News Today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ‘జగనన్న విద్యాదీవెన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మార్చి 2023తో ముగిసే త్రైమాసికానికి (జనవరి-ఫిబ్రవరి-మార్చి) సంబంధించి నిధులను విడుదల చేశారు. బటన్ నొక్కడం ద్వారా సీఎం జగన్ మొత్తం 9.95 లక్షల మంది విద్యార్థులకు రూ. 703 కోట్లను వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం విద్యాదీవెన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు త్రైమాసిక ప్రాతిపదికన ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తుంది. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్ పేదరికంతో విద్యార్థులు చదువులకు దూరం కాకూడదని, అలాగే వారిని చదివించేందుకు తల్లిదండ్రులు ఆర్ధికపరమైన బాధలు పడకూడదనే మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

 • నాలుగేళ్ళ వైసీపీ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యం.
 • రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి.
 • ప్రతిభ చూపించే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అండగా ఉంటాం.
 • సమాజంలో వివక్ష పోవాలన్నా.. పేదరికం రూపుమాపాలన్నా చదువు వల్లే సాధ్యం.
 • తరాల తలరాతలు మారాలన్నా.. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా విద్య ఒక్కటే మార్గం.
 • పిల్లలు చదువుకుంటే వారితో పాటు భావి తరాలు కూడా బాగుపడతాయి.
 • విద్యాదీవెన ద్వారా మొత్తం 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుస్తున్నాం.
 • విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.703 కోట్లు నేరుగా జమ చేస్తున్నాం.
 • విద్యాదీవెన పథకం కింద ఇప్పటివరకూ రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం.
 • నాడు-నేడు ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం.
 • ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో పాఠశాలల్లో 30 లక్షలు నుంచి 40 లక్షలకు పెరిగిన విద్యార్థుల సంఖ్య.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here