ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప-2 విజయోత్సవంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించి, ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు అల్లు ఫ్యాన్స్ సంతోషంతో కేరింతలు కొట్టారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో టికెట్ రేట్ల పెంపు సాధ్యమైందని పేర్కొంటూ, ఆయనపై తన ఆప్యాయతను వ్యక్తం చేశారు.
పుష్ప-2 సక్సెస్ మీట్ హైలైట్స్:
డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. తొలి రెండు రోజుల్లోనే రూ. 449 కోట్ల గ్రాస్ వసూలు చేసి నయా రికార్డులు నెలకొల్పింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, “ఈ విజయానికి కారణం మా టీమ్ మొత్తం. కానీ, దాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి మా దర్శకుడు సుకుమారే. నా పేరు ఏమన్నా వెలిగితే, దానికి కారణం ఆయన టేకింగ్,” అంటూ టీమ్ వర్క్‌ను కొనియాడారు.
పవన్ కళ్యాణ్‌పై స్పెషల్ కామెంట్స్:
“సినిమా టికెట్ ధరల పెంపులో కీలక పాత్ర పోషించిన కళ్యాణ్ బాబాయ్‌కి నా వ్యక్తిగత ధన్యవాదాలు. ఈ విషయంపై ఆయన చూపించిన సహకారం నా హృదయాన్ని టచ్ చేసింది,” అని అల్లు అర్జున్ అన్నారు. ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను సంతోషంలో ముంచెత్తాయి.
అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ ముగిసిందా?
గతంలో మెగా ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే, కళ్యాణ్ బాబాయ్‌ను గుర్తించి ఆయనపై ప్రేమ చూపించడంతో ఈ గొడవలు సమసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. “మీరు మారిపోయారు సార్,” అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.
అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్ ఫ్యాన్ ఇండియా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాజిటివ్ టాక్‌తో పాటు, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఫ్యాన్స్‌కు పండగలా మారింది.
ఫైనల్లీ… @alluarjun @PawanKalyan pic.twitter.com/kV09VUZiGo
— Balu Kondapalli (@Balu2070) December 7, 2024