బిగ్‌బాస్ విన్న‌ర్ సిద్ధార్థ్ శుక్లా క‌న్నుమూత‌

Bigg Boss 13 Winner Dies Of Heart Attack, Bigg Boss 13 Winner Sidharth Shukla, Bigg Boss 13 winner Sidharth Shukla dies, Bigg Boss 13 winner Sidharth Shukla dies of heart attack, Bigg Boss 13 Winner Sidharth Shukla Passes Away, Bigg Boss 13 Winner Sidharth Shukla Passes Away At 40, Mango News, Sidharth Shukla, Sidharth Shukla dies at 40, Sidharth Shukla Dies at 40 LIVE Updates, Sidharth Shukla Passes Away, Sidharth Shukla Passes Away At 40, Social Media Expresses Shock Bigg

హిందీ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బిగ్‌బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా సిద్ధార్థ్ శుక్లా మరణించినట్లు తెలుస్తుంది. ముందుగా అతన్ని ముంబయిలోని కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించినట్టు తెలుస్తుంది. కూపర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. సిద్ధార్థ్ శుక్లా బాలీవుడ్ సినిమాల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

మోడల్‌ గా తన కెరీర్‌ను ప్రారంభించిన సిద్ధార్థ్ శుక్లా, ఆతర్వాత పలు సీరియల్స్ లో, సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. బాలికా వధు, హిందీ బిగ్‌బాస్ తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్ సీజన్ 13 లో తనదైన శైలిలో విజేతగా నిలిచాడు. అలాగే జలక్ దిఖ్లాజా, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాది బాలీవుడ్ రియాలిటీ షోలలో కూడా సిద్ధార్థ శుక్లా పాల్గొన్నాడు. సిద్ధార్థ్ శుక్లా చివరిగా బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ సీజన్ 3లో నటించారు. సిద్ధార్థ్ శుక్లా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =