కరోనా సృష్టించిన విలయంతో దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఏడాదిన్నర నుంచే ప్రపంచం కొద్దికొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టింది.
అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత..పేరు కూడా తెలియని రకరకాల వ్యాధులు విజృంభించాయి.ముఖ్యంగా కరోనా ఓమిక్రాన్, జికా వైరస్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రాణం నష్టం జరగకపోయినా చాలామంది ఆస్పత్రుల పాలవడంతో పాటు ఆర్థికంగానూ నష్టపోయారు. అయితే ఇప్పుడు ప్రపంచానికి మరో విపత్తు పొంచి ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అమెరికాలో జంతువులు, పక్షుల్లో H5N1 అనే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మ్యూటేన్ తర్వాత ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందని..తర్వాత అదే ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు. ఇది సోకిన వారిలో సుమారు 50 శాతం మంది చనిపోతారట. అందువల్ల ముందే అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా జంతువుల్లో సోకే ఇన్ ఫెక్షన్ లను జాగ్రత్తగా పరిశీలించాలని లేకపోతే ఇదే మరో మహా విపత్తుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ అనేది నేరుగా మనుషుల రోగ నిరోధక వ్యవస్థ మీదే దాడి చేస్తుంది. అంతేకాదు ఇది తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. మందులకు కూడా లొంగదు పైగా దీనిని నివారించడానికి ఒక నిర్దిష్టమైన చికిత్స విధానమంటూ లేకపోవడంతో.. ఈ వైరస్ మందులకు లొంగదు. ఒకవేళ మందులు ఉపయోగించినా కూడా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చేసుకోవడంతో వైరస్ నియంత్రణ సాధ్యం కాదు. అలాంటప్పుడు ఈ వైరస్ బారిన పడకుండా చూసుకోవడమే ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.