ఆస్కార్‌కు ముందు ‘ఆర్ఆర్ఆర్’ మరో ఘనత.. ఈసారి ‘జపాన్ అకాడమీ అవార్డు’ కైవసం

RRR Wins 46th Japan Academy Award for Outstanding Foreign Film Category Ahead of Oscars,RRR Wins 46th Japan Academy Award,Outstanding Foreign Film,Outstanding Foreign Film Category Ahead of Oscars,Mango News,Mango News Telugu,Tollywood Star Actor Jr NTR,New York Film Critics Circle,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates

తెలుగు స్వాతంత్య్ర సమరవీరులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం పాత్రలతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత సాధించింది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం 46వ ‘జపాన్ అకాడమీ అవార్డు’ను గెలుచుకుంది. అత్యుత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇది అవార్డు సాధించింది. కాగా దీనికి ముందు మరే ఇతర భారతీయ చిత్రం కూడా ఇంతవరకు ఈ గుర్తింపు పొందలేదు. ఇటీవలే ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అజయ్ దేవగన్, అలియాభట్ వంట బాలీవుడ్ తారలు ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంటోంది. గతేడాది నవంబర్‌లో జపాన్‌లో విడుదలైన ఏ సినిమా ఇప్పటికీ అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘అవతార్-2’, ‘టాప్ గన్: మావెరిక్’ వంటి సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలను పక్కకు నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఘనత సాధించడం విశేషం. కాగా రాజమౌళి బృందం ఇప్పుడు ఆస్కార్ అవార్డుల కోసం సిద్ధమవుతోంది. ‘నాటు నాటు’ పాట కూడా నామినేట్ చేయబడి, ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ బరిలో నిలిచింది. ఒకవేళ ఈ అవార్డు కనుక సాధించగలిగితే ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టిస్తుంది. దీనితో పాటు మొత్తం 10 భారతీయ చిత్రాలు నామినేషన్ రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఆస్కార్‌ నామినేషన్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో సినీ అభిమానులు ఈ ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు. ఇక రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టులో భాగంగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా తీయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here