బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ ని ఎవరు గెలవబోతున్నారనే ఉత్కంఠకి మరి కొద్ది గంటల్లో తెరపడనుంది.ఈరోజు అర్ధ రాత్రికల్లా టైటిల్ విన్నర్ ఎవరో లీక్ అయిపోతుంది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరగబోతుంది. ఇప్పటికే ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు పాత కంటెస్టెంట్స్ అంతా హైదరాబాద్ కి వచ్చేసారు.
శుక్రవారం అర్థ రాత్రి 12 గంటలకు టైటిల్ విన్నర్ ఓటింగ్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే యూ ట్యూబ్ లో టోటల్ ఓటింగ్స్ ప్రకారం చూస్తే నిఖిల్ ఎవరికీ అందనంత రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి స్థానంలో నిఖిల్ ..రెండో స్థానంలో గౌతమ్ కొనసాగుతుండగా.. మూడవ స్థానంలో ప్రేరణ, నాల్గవ స్థానంలో నబీల్ ఉన్నారు.
ఇది కేవలం యూట్యూబ్ పోల్స్ మాత్రమే.అయితే ఇందులో నిఖిల్ కి గౌతమ్ కి మధ్య కనీసం 50 శాతం తేడా ఉండటంతో టైటిల్ విన్నర్ నిఖిల్ అని అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యూట్యూబ్ లో నిఖిల్ గౌతమ్ పై లీడింగ్ లో ఉంటే.. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, వెబ్ సైట్స్ పోల్స్ లో గౌతమ్ కూడా అదే రేంజ్ లీడింగ్‌లో ఉన్నాడు. వెబ్ సైట్స్ లో అయితే గౌతమ్ కృష్ణకి నిఖిల్ దరిదాపుల్లో కూడా లేడట. దీంతో గౌతమే టైటిల్ విన్నర్ గా నిలుస్తాడని అతని ఫిక్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉందట. అధికారిక ఓటింగ్ ప్రకారం నిఖిల్, గౌతమ్ అభిమానులు అనుకున్నట్టుగా లేదు. నిఖిల్, గౌతమ్ మధ్య అధికారిక ఓటింగ్ నువ్వా నేనా అనే రేంజ్లో జరిగిందట.ప్రస్తుతం టైటిల్ గెలిచే అవకాశాలు గౌతమ్ కే ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరైనా గెలవొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
కానీ ఇక్కడ మూడవ స్థానంలో ప్రేరణ కొనసాగుతుండగా, నాలుగు, ఐదు స్థానాల్లో నబీల్, అవినాష్ కొనసాగుతున్నారు. అయితే ప్రేరణకి సోషల్ మీడియా ఓటింగ్స్ లో చాలా ఓటింగ్ తేడా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, అధికారికంగా ఆమెకి చాలా ఎక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. దీంతో మధ్యలో మెగా చీఫ్ సమయంలో కొన్ని నెగటివ్ ఎపిసోడ్స్ పడడం వల్ల.. ఆమె టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నా..తాజా ఓటింగ్ ప్రకారం నిఖిల్, గౌతమ్ కు గట్టి పోటీ ఇస్తుందని ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.