దేశంలో స్వచ్ఛమైన ఎయిర్ ఉన్న నగరాల సంఖ్య 19 శాతానికి పైగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతోనే స్వచ్ఛమైన గాలి ఉన్న నగరాల సంఖ్య 25 కి పడిపోయింది. దేశంలోని 11 శాతం నగరాల్లో మాత్రమే ఇప్పుడు గాలి స్వచ్ఛంగా ఉండడం గమనార్హం. ఢిల్లీలో గాలిలో కరిగిన విషపు గాలుల వల్ల ప్రజలను ఎన్నో అనారోగ్యాలకి గురి చేస్తుంది. దీంతో ఢిల్లీలో ఉండాలంటేనే చిన్నా, పెద్దా భయపడే పరిస్తితి తలెత్తింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో గత 24 గంటల్లో కురుస్తున్న వర్షాల వల్ల.. గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ గాలి నాణ్యత సూచిక ప్రకారం.. ఈ ఉదయం 9గంటలకు నమోదయినట్లు చెప్పారు.అంటే ఇది మెరుగైన వాతావరణ పరిస్థితులను చూపుతుందని అన్నారు.
అజయ్ నగర్లో ఏక్యూఐ 115 నమోదవగా..పూసా రోడ్లో గాలి నాణ్యత సూచిక 149 నమోదయింది. ఇది కాకుండా, ఏక్యూఐ 200 కంటే తక్కువ ఉన్న ఢిల్లీలోని చాలా ప్రాంతాలు ఉండటంతో.. ఢిల్లీ మొత్తంగా ఏక్యూఐ 189గా నమోదైంది.
అయినా కూడా ఢిల్లీలోని గాలి నాణ్యత మెరుగుపడిన ప్రాంతాలు చాలా ఉన్నా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ , ఇప్పటికీ ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు, ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లోని ఏక్యూఐ శనివారం 252గా నమోదైంది. అంటే గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో ఉన్నట్లే లెక్క.
అయితే కాస్త వాతావరణం మెరుగుపడటంతో..మొత్తం ఢిల్లీ-NCRలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 కండిషన్లు తొలగించబడటంతో.. ఇప్పుడు ఢిల్లీలో అన్ని రకాల ట్రాక్‌లపై ఎలాంటి పరిమితి విధించలేదు. దీంతో స్కూల్స్ కూడా పునఃప్రారంభం కానున్నాయి. అయినా కూడా మొత్తం ఢిల్లీ NCRలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2 ఇప్పటికీ వర్తిస్తుంది.
ఢిల్లీలో శుక్రవారం కురిసిన వర్షం ఏకంగా 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ మొత్తం ఎయిర్ ఇండెక్స్ సూచీ 189 వద్ద నమోదైంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బయటపడింది. ఆనంద్ విహార్ ఏక్యూఐ 252, సిరి ఫోర్ట్-252, బవానా-244, ముండ్కా-231, వివేక్ విహార్-224గా నమోదైంది. ఈ ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి మించి ఉంది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో తగ్గుతున్న ఏక్యూఐ వల్ల.. సెంట్రల్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3 లిమిట్స్‌ను తొలగించింది. అయినా కూడా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-1, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2 కండిషన్ల లిమిట్స్ ఢిల్లీ-NCRలో ఇప్పటికీ వర్తిస్తాయి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2 నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో డీజిల్ జనరేటర్లపై నిషేధం, పార్కింగ్ ఛార్జీల పెంపు, సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో ఫ్రీక్వెన్సీని పెంచడానికి ఆర్డర్స్ ఉన్నాయి.