
దక్షిణ కొరియాలో యువాన్ ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జేజు ఎయిర్ ఫ్లైట్ 7C2216 రన్‌వే మీద అదుపు తప్పి గోడను ఢీకొట్టడంతో భారీ మంటలు చెలరేగాయి. ఈ విమానంలో మొత్తం 181 మంది ప్రయాణిస్తుండగా, అందులో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని యోన్హాప్ రిపోర్ట్ వెల్లడించింది. కొన్ని రిపోర్టుల ప్రకారం 85 మంది మృతిచెందినట్లు సమాచారం, అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ఈ విమానం దక్షిణ కొరియాలోని యువాన్ ఎయిర్ పోర్టుకు చేరుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నేషనల్ ఫైర్ ఏజెన్సీ ప్రకారం, ల్యాండింగ్ సమయంలో పక్షి తగలడంతో ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తి ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీములు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మంటల తీవ్రత వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై దక్షిణ కొరియా మౌలిక వసతులు మరియు రవాణాశాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఆపద్ధర్మ అధ్యక్షుడు చోయి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
– Jeju Air flight with 175 people on board crashes at Muan International Airport in South Korea #aircrash#SouthKorea #Jeju pic.twitter.com/JrwvKjar2U
— Shahinur Rahman Shorif (@EpicNomadic) December 29, 2024