గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా మార్కెట్ కమిటీ వెల్లడించింది. మార్కెట్ ప్రాంగణంలో భౌతిక దూరం నిబంధనలు పాటించడం లేదని, దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతోనే మార్కెట్ కొన్ని రోజులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి మార్కెట్ కు ఎవరూ మామిడి కాయలు తీసుకురావద్దని కమిటీ రైతులకు విజ్ఞప్తి చేసింది. మార్కెట్ మూసివేత సమాచారాన్ని ఇప్పటికే రైతులకు, ఏజెంట్స్ లకు తెలియజేశామని చెప్పారు. తిరిగి మార్కెట్ ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని కమిటీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]