విశాల్ ఆరోగ్యం గురించి అసలు నిజం చెప్పిన ఖుష్బూ..

khushboo reveals the truth about vishals health, khushboo ,vishals health,Actor Vishal, Anjali, Khushboo reveals the truth about Vishal’s health, Madagadaraju, Varalakshmi Sarath Kumar, Cinema Updates, Cine Live Updates, Breaking News, Highlight, Headlines, Mango News, Mango News Telugu

ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ ప్లాట్ ఫామ్ చూసినా తమిళ హీరో విశాల్ వీడియోలే కనిపిస్తున్నాయి. తాజాగా మదగజరాజు సినిమా ఈవెంట్‏లో విశాల్ ఊహించని లుక్‏లో కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు. విశాల్ అలా అయిపోయాడేంటి…అంతగా చేతులు చేతులు వణుకుతున్నాయేంటి అంటూ రకరకాల ప్రశ్నలు, అనుమానాలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. విశాల్‌కు ఏమైందోనని తీవ్ర ఆందోళనకు గురవుతూ ఫ్యాన్స్ పెట్టిన కామెంట్లతో సోషల్ మీడియా లోడ్ పెరుగుతోంది..

కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న విశాల్.. తాజాగా జరిగిన మదగజరాజు మూవీ ఈవెంట్లో ఊహించని లుక్‏లో కనిపించాడు. బక్కగా మారిపోయి వణుకుతూ కనిపించడమే కాకుండా మాట కూడా స్పష్టంగా మాట్లాడలేకపోయాడు. కనీసం నిలబడటానికి కూడా విశాల్ ఇబ్బంది పడడం చూసి ఆయనకు ఏమైందోనని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. విశాల్ జ్వరంతో బాధపడుతున్నాడని ఆయన టీమ్ చెప్పినా..అంతకంటే పెద్దవ్యాధితోనే బాధపడుతున్నారంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి సమయంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సీనియర్ నటి ఖుష్బూ .. విశాల్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. విశాల్‏కు ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్‌కు జ్వరం వచ్చిందని.. కానీ మదగజరాజు సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందని తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆ మూవీ వేడుకకు వచ్చారని ఖుష్బూ చెప్పారు. ఆరోజు విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారని తెలిపారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే తన సినిమా 11 ఏళ్ల తర్వాత అడియన్స్ ముందుకు వస్తుందని.. అందుకే కచ్చితంగా రావాలనుకున్నానని విశాల్ చెప్పారని చెప్పుకొచ్చారు.

ఆ ఈవెంట్ రోజు విశాల్ కు 103 డిగ్రీల జ్వరం ఉందని.. అందుకే ఆయన వణికిపోయారని ఖుష్బూ వివరించారు. ఆ ఈవెంట్ పూర్తికాగానే తామంతా విశాల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లామని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని ఆమె చెప్పారు. విశాల్ ఆరోగ్యం గురించి ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే విశాల్ ఆరోగ్యం గురించి కొంతమంది యూట్యూబర్స్ తప్పుడు వార్తలు రాస్తున్నారని ఖుష్బూ అసహనం వ్యక్తం చేశారు.

కాగా విశాల్ హీరోగా నటించిన మదగజరాజు చిత్రానికి ఖుష్బూ భర్త సుందర్ .సి డైరక్షన్ వహించారు. ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించగా.. దాదాపు 11 ఏళ్ల తర్వాత వస్తున్న విశాల్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.