సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక

Tollywood Senior Actor Superstar Krishna Hospitalized Due To Illness, Tollywood Senior Actor, Superstar Krishna Hospitalized,Superstar Krishna Illness,Mango News,Mango News Telugu,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna, Actor Krishna Hospitalized,Krishna Hospitalized,Krishna News And Live Updates,Superstar News And Updates

టాలీవుడ్ సినీయర్‌ నటుడు, మహేష్ బాబు తండ్రి, సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కృష్ణ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యుడు, నటుడు నరేష్‌ మీడియాకు తెలియజేశారు. గత రాత్రి కృష్ణ అస్వస్థతకు గురయ్యారని, దీంతో ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం బాగానే ఉందని, 24 గంటల తర్వాత హస్పిటల్‌ నుండి ఆయనను డిశ్చార్జీ చేస్తామని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. కాగా ఇటీవలే కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణం తరువాత కృష్ణ మరింత కుంగిపోయారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆయనకు గత వారం రాజులుగా ఆరోగ్యం క్షిణించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కృష్ణ ఆరోగ్యం విషయం తెలియడంతో ఇతర కుటుంబ సభ్యులు కాంటినెంటల్ హాస్పటల్‌కు చేరుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =