ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ఖరారు

Prime Minister Narendra Modis Visit To France Finalized, Prime Minister Narendra Modi, Modi Visit To France, Narendra Modis Visit To France Finalized, Modi Tour To France, Modi France Tour, Artificial Intelligence Action Summit, CCS, Delhi Assembly Elections, French President Emmanuel Macron, National News, International News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత బంధం బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య రెండు భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కాబోతున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడయిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కోసం..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో పారిస్‌కు వెళ్లనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

రష్యా తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్ కూడా భారతదేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనికోసం 2025 ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

భారతదేశాన్ని చాలా ముఖ్యమైన దేశంగా ఫ్రాన్స్ అభివర్ణించిన ఫ్రాన్స్.. ఫిబ్రవరి 2025లో పారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌కు భారత ప్రధానిని ఆహ్వానించింది. తప్పుడు సమాచారం, సాంకేతిక దుర్వినియోగంతో పాటు ప్రధాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలు ఈ సమ్మిట్‌లో చర్చించనున్నారు. ప్రెసిడెంట్ మాక్రాన్ సమ్మిట్ లక్ష్యాలకు భారతదేశం సంభావ్య ప్రభావాన్ని, సహకారాన్ని అందించబోతోంది.

కాగా ఈ AI సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌కు వెళతారని, ఈ సమయంలోనే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం కూడా జరగవచ్చని భావిస్తున్నారు. దీంతో ఇరు దేశాలు.. తమతమ దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని పీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ పరంగా సహాయ, సహకారాలు అందించుకోవాలని రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఖరారైన రక్షణ ఒప్పందం మొత్తం వ్యయం సుమారు 10 బిలియన్ డాలర్లు అని అధికారులు తెలిపారు. ఇందులో 26 రాఫెల్ M ఫైటర్ జెట్‌లు, 3 అదనపు స్కార్పెన్ కేటగిరీ సాంప్రదాయ జలాంతర్గాములు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కాగా ఈ ఒప్పందాలను కేబినెట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదం కోసం సమర్పించారు.