తమిళనాడులో మళ్ళీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌, అనుమతులు వీటికే…

Chief Minister of Tamil Nadu, Coronavirus in Tamil Nadu, Palani Swamy, Tamil nadu, Tamil Nadu Corona Updates, Tamil Nadu Four Districts Under Strict Lockdown, Tamil Nadu government, Tamil Nadu Lockdown, Tamil Nadu Lockdown Extension, Tamil Nadu Lockdown From 19, Tamil Nadu Lockdown news, Tamil Nadu Lockdown Updates

తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్దసంఖ్యలో నమోదవుతుండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 19 నుండి 30 వరకు చెన్నైతో సహా నాలుగు జిల్లాల్లో మళ్ళీ పూర్తిస్థాయిలో కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌ విధించనున్నట్టు జూన్ 15, సోమవారం నాడు ప్రకటించారు. తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్ జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు.

లాక్‌డౌన్ విధించిన 12 రోజుల్లో వచ్చే రెండు ఆదివారాల్లో మాత్రం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉంటుందని, కేవలం మెడిసిన్, మిల్క్ మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు. కాగా దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా తమిళనాడులోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటికీ 44,661 పాజిటివ్‌ కేసులు నమోదు అవగా, 24,547మంది కోలుకున్నారు, 435 మంది ప్రాణాలు కోల్పోయారు.

నాలుగు జిల్లాల్లో అమలు కాబోయే లాక్‌డౌన్‌ నిబంధనలు:

  • కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు లకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి.
  • నిత్యావసర సర్వీసులకు మినహాయింపు.
  • ఆటోలు, టాక్సీ క్యాబ్‌లు కేవలం వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు మాత్రమే అనుమతి.
  • సొంత వాహనాల్లో మార్కెట్‌కు వెళ్లే వ్యక్తులుకు ఇంటి నుండి కేవలం 2 కిలోమీటర్ల వెళ్లేందుకు మాత్రమే అనుమతి.
  • అవసరమైన సేవలు మరియు వైద్య అత్యవసర పరిస్థితులకు అనుమతి.
  • ఆస్పత్రులు, ఫార్మసీలు, ప్రయోగశాలలు మరియు అంబులెన్సులు యధాతధంగా పనిచేస్తాయి.
  • కంటైన్మెంట్ ప్రాంతాల నుండి ఉద్యోగులు విధులకు రావలసిన అవసరం లేదు.
  • జూన్ 19 నుంచి జూన్ 30 మధ్య 33 శాతం సిబ్బందితోనే బ్యాంకులు పనిచేస్తాయి. ఏటిఎంలు అంతటా తెరవబడతాయి.
  • రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు, వైద్య-ఆరోగ్యం, మున్సిపల్ కార్పొరేషన్ వంటి అత్యవసర కూడా 33 శాతం సిబ్బందితోనే పనిచేయడానికి అనుమతించబడ్డాయి.
  • టేకావే సర్వీసుతో హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి.
  • టీ దుకాణాలకు అనుమతి లేదు.
  • వివాహాలు, మరణాలు మరియు వైద్యం నిమిత్తం చెన్నై నుండి వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి ఇ-పాస్ ఇవ్వనున్నారు.
  • వేరే ప్రాంతాల నుంచి విమాన, రైళ్లు ద్వారా ఈ నాలుగు జిల్లాలకు వచ్చే వారికి, ప్రస్తుతం అమలులో అన్ని కోవిడ్ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
  • ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాకు మినహాయింపు.
  • అమ్మ కాంటీన్స్ మరియు కమ్యూనిటీ కిచెన్‌లు తెరిచి ఉంటాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =