ఆస్ట్రేలియాతో టీ20 పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి టీ20 మ్యాచ్

India vs Australia T20 Series First T20 Match Today at Mohali From 7 PM, India vs Australia T20 Series, India vs Australia T20, Ind vs Aus T20 Series First T20 Match, Ind vs Aus Match, Ind vs Aus Match Mohali Stadium, Mango News, Mango News Telugu, India vs Australia T20 Series , India vs Australia T20 Match, Indian Captain Rohit Sharma, Australia Captain Aaaron Finch, India Vs Australia Live Updates, India Vs Australia Match Live Scores

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో 3 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో రాత్రి 7.00 గంటల నుంచి మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా టీ20 ప్రపంచకప్ కు ముందు సన్నాహంలో భాగంగా ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలని భారత్ జట్టు భావిస్తుంది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మూడోస్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సూర్యకుమార్‌, హార్దిక్ పాండ్యా మెరుగ్గా రాణించడంపైనే ప్రధానంగా భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

తుది జట్టులో వికెట్‌ కీపర్‌ గా రిషబ్ పంత్‌ కు ఛాన్స్ ఇస్తారా లేదా దినేశ్‌ కార్తీక్‌ను ఆడిస్తారా చూడాల్సి ఉంది. రవీంద్ర జడేజా స్థానంలో దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌ లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఇక గాయాల నుంచి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ తిరిగి జట్టులోకి రావడం, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యజ్వేంద్ర చాహల్, ఉమేష్ యాదవ్ లతో భారత్ బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా మారింది.

మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్ భారత్ పై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కాగా కీలక ఆటగాళ్లు అయిన మిచెల్ స్టార్క్‌, మార్కస్ స్టాయినిస్‌, మిచెల్‌ మార్ష్‌ గాయాలతో ఈ సిరీస్ కు దూరమవగా, స్టార్ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ కు విశ్రాంతి ఇచ్చారు. బౌలింగ్‌ విభాగంలో జోష్ హేజిల్‌వుడ్‌, పాట్ కమిన్స్‌, డానియల్ సామ్స్‌, ఆడమ్ జంపా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఈ టీ20 సిరీస్ లో మెరుగైన ప్రదర్శన చేసి భారత్ పై ఆధిపత్యం సాధించి ప్రపంచకప్-2022 టోర్నమెంట్ కు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. టీ20ల్లో ఇరు జట్లు ప్రభావశీలంగా ఉండడంతో ఈ సిరీస్‌ హోరాహోరీగానే సాగే అవకాశముంది.

భారత్ (తుది జట్టు అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్/దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్/ దీపక్ చాహర్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా (తుది జట్టు అంచనా): ఆరోన్ ఫించ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, ఆడమ్ జంపా, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, డేనియల్ సామ్స్/సీన్ అబాట్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here