ఆ 6,700 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి?

Where Is That Rs 6700 Crore,2 Thousand Rupee Notes,RBI,RBI Announcement,Where Is That Rs 6700 Crore,Reserve Bank Of India Says Rs 6700 Crore In Rs 2000 Notes Still Not Returned,Mango News,Mango News Telugu,Reserve Bank Of India,RBI Says Rs 6700 Crore In Rs 2000 Notes Still Not Returned,Rs 6700 Crore In Rs 2000 Notes Still Not Returned,Rs 6700 Crore In Rs 2000 Notes,2000 Notes,2000 Notes In India,India,India Rupee,India Currency,RBI Latest News,RBI News,2000 Currency Notes,2000 Currency Notes News

ఆర్బీఐ 2వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుని 19 నెలలకు పైనే అయింది. అయినా ఇంకా 6,700 కోట్ల రూపాయల నోట్లు వాపసు కాలేదని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. ఇన్ని నెలలు అయినా కూడా ఈ నోట్లు ఎక్కడికి పోయాయంటూ ఆర్బీఐ తర్జనభర్జన పడుతోంది.

2018-19లోనే 2 వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేశారు. నిజానికి పెద్ద నోట్ల రద్దు తర్వాత అంటే వెయ్యి రూపాయలు,500 రూపాయలు నోట్ల రద్దు తర్వాత ..ప్రజలకు పెద్ద పెద్ద అవసరాలకే కాదు చిన్న అవసరాలకు కూడా డబ్బులు అందడంలో ఇబ్బంది పడ్డారు.దీంతోనే 2 వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత 2వేల రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేసింది.

2వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించి ఏడాదిన్నర దాటింది. అయితే తాము ముద్రించిన నోట్లలో 1.88 శాతం కరెన్సీ నోట్లు ఇంకా వెనక్కి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఆర్బీఐ డేటా ప్రకారం, తిరిగి రాని కరెన్సీ నోట్లు 6వేల691 కోట్ల రూపాయలని అధికారులు తెలిపారు.

2023లో 2 వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకున్నారు. తర్వాత భారతదేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో 2వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేసేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను బ్యాంకులతో పాటు, ప్రభుత్వంతో ఆమోదం పొందిన కార్యాలయాల్లో డిపాజిట్ చేశారు.

ఈ పథకం చెలామణిలో ఉన్నప్పుడు మొత్తం 2000 నోట్ల విలువ 3.56 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఇది డిసెంబర్ 31, 2024 నాటికి 6వేల691 కోట్లరూపాయలకు తగ్గిందని ఆర్‌బీఐ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే చెలామణిలో ఉన్న 2వేల నోట్లలో 98.12 శాతం తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. దానికి సంబంధించి 2 వేల రూపాయల నోట్లలో 1.88 శాతం తిరిగి రాలేదు.