కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 17,804 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 543 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.04 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,30,150 కు చేరుకుంది. ఇక గత 24 గంటల్లో కొత్తగా ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదని తెలిపారు.
అయితే పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 2 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 79 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 67,631 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 872 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 64,57,300 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 4,389 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ