నో అనేది చిన్న పదమే కానీ..చెప్పడం మాత్రం కొందరికి చాలా కష్టం. అలాంటివారికి ‘నో ’చెప్పలేని సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలనే సామెతను ఎప్పుడూ మైండ్‌లో పెట్టుకోవాలంటారు నిపుణులు. ఎస్ చెప్పి..అవతలివారికి మాటిచ్చాక ఆ పని చేయలేక .. పడే ఇబ్బంది కంటే ముందే నో చెప్పడం ఎంతో మంచిది.
అలా చెప్పడం వల్ల మొదటిలో తప్పు చేసిన భావన ఉంటుంది. కానీ జీవితంలో విజయాన్ని సాధించాలంటే.. నలుగురు మెచ్చుకునేలా ఏదో ఒక దశకు చేరుకోవాలంటే మాత్రం ‘నో’ అని కొన్నిసార్లు అయినా చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే వారికి మాటివ్వడం వల్ల అదే మీ గోల్‌కు అడ్డంకి గా మారొచ్చు. మీ లక్ష్య సాధనకు కావాల్సిన సమయాన్ని కేటాయించలేరు. దీనివల్ల జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే కాస్త కష్టమైన ‘నో’ ఎలా చెప్పాలి
మన లైఫ్‌లో కొన్నిసార్లు ‘నో’ అని చెప్పడానికి సిగ్గుపడతాం. ఇలాంటివాళ్లు స్వభావరీత్యా కాస్త భయస్తులు అయి ఉంటారు. ఎవరితోనైనా ‘నో’ చెబితే ఎదుటి వ్యక్తి బాధ పడతాడేమోనని భయపడతారు. అతని ఏమనుకుంటాడో అని అదేపనిగా ఆలోచిస్తూ మనం కలత చెందుతారు. అందుకే అలా ఆలోచిస్తూ తమ మనసును, కోరికను తామే చంపుకుని ఎదుటి వ్యక్తితో నో చెప్పడం కంటే ఎస్ అని చెప్పడమే బెటరనుకుంటారు.
ప్రొఫెషనల్ లైఫ్‌లో భయంతో ‘నో’ చెప్పలేక మౌనంగా ఉంటారు. ఒకవేళ నో చెబితే అది మనసులో పెట్టుకుని తమ ఉద్యోగంలో ఆటంకాలు కలిగిస్తారేమోనని ఆలోచిస్తారు.ఫ్యూచర్‌లో కూడా ఒకే ఆఫీస్‌లో పని చేస్తారు కాబట్టి.. అతనితో పని చేసినప్పుడు అది మనసులో పెట్టుకుని తన గురించి పక్కవారికి చెడ్డగా చెబుతారేమో అని అనుకుంటారు.
అందుకే ఎదుటి వ్యక్తి తనను వాడుకుంటున్నారని తెలిసి కూడా నో చెప్పలేక తనలో తానే మదనపడుతుంటారు.
పర్సనల్ లైఫ్‌లో అయినా. ప్రొఫెనల్ లైఫ్‌లో అయినా ‘నో’ చెప్పగలిగిన వాడే జీవితంలో సక్సెస్ అవుతాడంటారు నిపుణులు. ఎందుకంటే అప్పుడే తన గోల్ కోసం కావాల్సిన సమయాన్ని ఇచ్చి విజయాన్ని సాధిస్తాడని అంటున్నారు.ఒక్కోసారి డబ్బుల విషయంలోనూ , టైమ్ విషయంలోనూ చాలా సార్లు మోసపోవాల్సి వస్తుంది. అందుకే మీకు ఎవరైనా పని చెప్పినప్పుడు..లేదా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నష్టపోతాం అని ఏమాత్రం అనిపించినా.. ‘నో’ చెప్పడానికి అస్సలు సంకోచించొద్దని చెబుతున్నారు.