ఆంధ్రప్రదేశ్ ప్రజలల కల సాకారం కాబోతోంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే రాజధాి పనులు ప్రారంభంకాబోతున్నాయి. అమరావతిని పూర్తి చేసి.. ది బెస్ట్ కాపిటల్ సిటీగా తీర్చిదిద్దామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ మూడేళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించింది. అందుకే ఏపీ రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి నిర్మాణ పనులు ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభం కానున్నాయి. రాజధానికి కావాలసిన అన్నిరకాల పనులకు ఇప్పటికే నిధులను కూడా సమకూర్చింది.
ఏపీ రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరు లోపు పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తాజాగా తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 40 పనులకు టెండర్లు కూడా పూర్తి చేసామని వివరించారు. ఫిబ్రవరి రెండో వారంలో క్యాపిటల్ సిటీ పనులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మూడేళ్లలోనే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
తాజాగా రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ.. హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర నీట పంపింగ్‌ను అలాగే నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి.. అసెంబ్లీ జరగని మిగిలిన రోజుల్లో దానిని టూరిజం స్పాట్‌గా మార్చాలనే ఉద్దేశంతో డిజైన్లు రూపొందించామని నారాయణ తెలిపారు.
రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఏపీ రాజధాని అమరావతిలో ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్‌లు డిజైన్ చేశామని మంత్రి వివరించారు. అమరావతి పనుల్లో రాజీ పడేదిలేదన్న నారాయణ.. ఏపీ రాజధానిని ప్రపంచంలోనే టాప్-5లో ఒకటిగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ తాజా ప్రకటనతో ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.