ఏపీలో మద్యం ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Andhra Pradesh liquor price, andhra pradesh liquor price 2020, andhra pradesh liquor price list 2020, Andhra Pradesh liquor price reduced, AP Government, AP Government Issued Orders on Revised Liquor Prices, AP Liquor Prices, liquor price hike in andhra pradesh, liquor price reduced in Ap, Revised Liquor Prices

రాష్ట్రంలో మద్యం ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 3, గురువారం నాడు నిర్వహించిన కేబినెట్ భేటీ అనంతరం మద్యం ధరలను సవరిస్తూ రాష్ట్ర‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్‌ లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌ మరియు వైన్‌ ధరలలో ప్రభుత్వం మార్పులు చేసింది. వివిధ రకాల పరిమాణంతో రూ.150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్ల మద్యం బాటిల్స్ పై ప్రభుత్వం ధరలను తగ్గించింది. అలాగే 90ఎంఎల్ నుంచి మొదలు వివిధ పరిమాణాల్లో రూ.190 నుంచి రూ.600 వరకు ధర ఉన్న మద్యం బాటిల్స్ పై ధరలను పెంచారు. బీర్లు, రెడీ టు డ్రింక్‌ ధరలు కూడా రూ.30 మేర తగ్గించారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టే నేపథ్యంలోనే తక్కువ బ్రాండ్ విలువ ఉన్న మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =