భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. కొద్ది రోజుల క్రితం, అతను ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వ్యాపించాయి. ఆమె పుట్టినరోజు వేడుకలో ఇద్దరూ కలిసి నవ్వుతూ కనిపించిన ఫోటోలు వైరల్ కావడంతో, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ప్రచారాన్ని ముగించేందుకు సిరాజ్ జనైను తన సోదరిగా పేర్కొన్నాడు. ఆ తర్వాత జనై కూడా సిరాజ్ చేసిన పోస్ట్‌ను లైక్ చేయడంతో ఈ పుకార్లకు తెరపడింది.
ఇప్పుడు, సిరాజ్ మరో ప్రేమ గాసిప్‌తో హాట్ టాపిక్ అయ్యాడు. తాజా నివేదికల ప్రకారం, అతను బిగ్ బాస్ ఫేమ్, టెలివిజన్ నటి మహీరా శర్మతో డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 2023 నవంబర్‌లో మొదటిసారి వీరిద్దరి మధ్య ఏదో కొనసాగుతోందని సోషల్ మీడియాలో ఊహాగానాలు షికార్లు చేశాయి. మహీరా పోస్ట్ చేసిన ఫోటోకు సిరాజ్ లైక్ కొట్టడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, వీరిద్దరూ చాలా కాలంగా మాట్లాడుకుంటున్నారు, వారి సంబంధం మరింత బలపడుతోందని అంటున్నారు.
ఇంతకు ముందు, మహీరా శర్మ బిగ్ బాస్ కంటెస్టెంట్ పరాస్ ఛబ్రాతో డేటింగ్లో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 13లో వీరిద్దరూ దగ్గరయ్యారు, హౌస్‌లోనే కాకుండా హౌస్ బయట కూడా వారి రిలేషన్ కొనసాగింది. అయితే, 2023లో వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో, మహీరా పరాస్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడమే కాకుండా, ఇద్దరి కలిసిన ఫోటోలను కూడా డిలీట్ చేసింది. పరాస్ కూడా ఈ బ్రేకప్ వార్తలను ధృవీకరిస్తూ, వారు చిన్న చిన్న విషయాలకు తరచూ వాదులాడుకునేవారని వెల్లడించాడు.
ప్రస్తుతం, మహీరా-సిరాజ్ డేటింగ్ గురించి ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నా, ఇద్దరూ ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, మహీరా తల్లి సానియా శర్మ మాత్రం, ఈ వార్తలను ఖండిస్తూ, “వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, ప్రజలు ఏదైనా ఊహించుకుంటారు” అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, సిరాజ్ ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు కానీ ఛాంపియన్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. దీంతో అతను నేరుగా ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. మహీరా శర్మ ప్రస్తుతం టెలివిజన్ మరియు సినిమాల్లో బిజీగా ఉంది. బిగ్ బాస్ 13 ఫైనలిస్ట్‌గా నిలిచిన ఆమె, నాగిన్, బేపనా ప్యార్, కుండలి భాగ్య వంటి హిట్ షోలతో గుర్తింపు పొందింది. 2023లో పంజాబీ మూవీ “లెహంబర్గిన్ని” ద్వారా వెండితెరకు అడుగుపెట్టింది.
అభిమానులు ఇప్పుడు మహీరా-సిరాజ్ మధ్య నిజంగా ఏదైనా ఉందా? లేదా కేవలం పుకార్లా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో వీరిద్దరిలో ఒకరు అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.
View this post on Instagram
View this post on Instagram