ఆసియాకప్‌లో సూపర్‌-4కు ముందు టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్‌ జడేజా ఔట్‌

Asia Cup 2022 Team India Star All Rounder Ravindra Jadeja Ruled Out Due To Injury Axar Patel To Replace Him, Team India Star All Rounder Ravindra Jadeja Ruled Out Due To Injury, Axar Patel To Replace Ravindra Jadeja, Star All Rounder Ravindra Jadeja, Asia Cup 2022, 2022 Asia Cup, Ravindra Jadeja, Ravindra Jadeja gets ruled out of Asia Cup 2022, Axar Patel, Asia Cup 2022 News, Asia Cup 2022 Latest News And Updates, Asia Cup 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఆసియాకప్‌లో ఫెవరెట్‌గా బరిలోకి దిగి అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తున్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. జట్టులో నమ్మదగ్గ ఆటగాడిగా పేరొందిన స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసియాకప్‌ టోర్నీ నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. రవీంద్ర జడేజా కుడి మోకాలికి గాయం అయినట్లుగా తెలిపింది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. దీంతో బీసీసీఐ ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ గాయపడిన జడేజా స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ను టోర్నీకి ఎంపిక చేసింది. అయితే ఆసియాకప్‌కు స్టాండ్‌-బై క్రికెటర్‌గా ఉన్న అక్షర్‌ పటేల్ ఇప్పుడు తుది జట్టులోకి రానున్నాడు. ఇక అక్షర్ పటేల్‌ త్వరలోనే దుబాయ్‌లోని జట్టుతో చేరనున్నాడు.

కాగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 148 పరుగుల ఛేజింగ్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా కీలకమైన 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే హాంకాంగ్‌తో మ్యాచ్‌లో జడేజాకు బ్యాటింగ్‌కు దిగే అవకాశం రానప్పటికి ఫీల్డింగ్‌లో తనదైన మార్క్ చూపించాడు. అంతేకాకుండా ఒక వికెట్ తీయడం ద్వారా ఆసియాకప్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 23 వికెట్లతో మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ను అధిగమించాడు. ఈ నేపథ్యంలో.. జడేజా గాయంతో జట్టుకు దూరం కావడం టీమిండియాకు షాక్ గానే చెప్పొచ్చు. ఈ క్రమంలో సూపర్‌-4లో భాగంగా ఆదివారం బి2 (పాకిస్తాన్‌ లేదా హాంకాంగ్‌)తో జరిగే మ్యాచ్‌కు అక్షర్‌ పటేల్‌ లేదా దీపక్‌ హుడాలలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =