బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఆకాశమే హద్దు అన్నట్లుగా పసిడి ధరలు దూసుకెళ్తున్నాయి. కనకం ధర ఏకంగా లక్షకు చేరువవుతోంది. దీంతో గోల్డ్ లవర్స్ కు బంగారం కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంగారం ధరలు ఇలా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే అంటున్నారు మార్కెట్ నిపుణులు. దీనికితోడు ఫిబ్రవరి స్టార్ట్ అవడంతో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. అలంకారం కోసం కాకపోయినా అవసరం కోసం అయినా బంగారు ఆభరణాలు కొనడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
దేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలను ఒకసారి పరిశీలించినట్టయితే.. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 7,704లుగా కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,404 లుగా పలుకుతోంది. ఇక హైదరాబాద్లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల పసిడి ధర రూ. 84,040గా కొనసాగుతోంది. అటు విజయవాడలో 10 గ్రాముల గోల్డ్ 22క్యారెట్లు ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల పసిడి ధర రూ. 84,040గా కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం 22క్యారెట్లు ధర రూ. 77,040గా ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర రూ. 84,040గా కొనసాగుతోంది.