నకిలీ ఓట్లను ఏం చేయాలి?

Did You Draw Fake Notes at the ATM,Did You Draw Fake Notes,Fake Notes at the ATM,Fake Currency,RBI,Draw Fake Notes At The ATM,What To Do With Fake Votes,Fake Note From An ATM,RBI For Destruction,Mango News,Mango News Telugu,Found Fake Note In Bank ATM,How To Spot A Fake Currency,Reserve Bank Of India,Fake Notes At ATM Booths,ATM Fake Notes Latest News,ATM Fake Notes Latest Updates
Fake Currency,RBI,draw fake notes at the ATM?,What to do with fake votes?

ఇప్పుడు  ఆన్ లైన్ ట్రాన్జాక్షన్స్‌తోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అవతలివారికి డబ్బులు పంపడం దగ్గర నుంచి ..పెద్ద పెద్ద కొనుగోళ్లు, బిల్స్ పే చేయడం వరకూ అన్నీ ఆన్ లైన్‌లోనే అయిపోతున్నాయి. చివరకు పెళ్లిళ్లకు చదివింపులు కూడా ఆన్ లైన్‌లోనే చేస్తున్న వార్తలు కూడా వింటున్నాము.

అయితే కొంతమంది మాత్రం ఏటీఎమ్‌కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి ఏటీఎం నుంచి నకిలీ నోట్లు వస్తుంటాయి. అప్పుడు చేయాలో తెలియక చాలామంది వేరేవాళ్లకు అంటగట్టేస్తారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే మీరు కావాలని అవతలి వాళ్లను మోసం చేసినట్లు అవుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆన్ లైన్ ట్రాన్జాక్షన్స్ జరుగుతున్నా కూడా..దేశవ్యాప్తంగా  రూ.30 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు డబ్బు రూపంలోనే  జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలోనే ఏటీఎమ్ నుంచి నకిలీ నోట్లు వచ్చిన సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ఏటీఎం నుంచి నకిలీ నోట్లు వస్తే వెంటనే కొన్ని పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీరు ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసిన వెంటనే మీ బ్యాగులోనో, జేబులోనో పెట్టేసుకోకుండా ఆ డబ్బులు కరెక్టుగా ఉన్నాయా , అందులో చిరిగిన లేక నకిలీ నోట్లు ఉన్నాయా అని పరిశీలిస్తే మంచిది. అలా అందులో నకిలీ నోటును గుర్తించినా లేక అనుమానం వచ్చినా వెంటనే.. ముందుగా దాని ఫోటో తీయాలి. ఆ తర్వాత ఏటీఎంలో ఉన్న సీసీటీవీ కెమెరా ముందు ఆనకిలీ నోటును తలకిందులుగా చూపించాలి. దీనివల్ల ఏటీఎం నుంచే ఈ నోటు బయటకు వచ్చినట్లు ఆ సీసీ కెమెరా రికార్డు చేస్తుంది. ఇప్పుడు డబ్బు డ్రా చేసిన తర్వాత ఏటీఎం నుంచి వచ్చిన స్టేట్మెంట్‌ను తీసుకుని, దానికి కూడా ఫోటో తీసి దాన్ని సేవ్ చేయాలి.

ఇప్పుడు బ్యాంకుకు వెళ్లి ఆ నకిలీ నోటును ,ఏటీఎంలో వచ్చిన స్టేట్మెంట్‌ను చూపించాలి. అక్కడ ఉద్యోగి వెంటనే ఓ కంప్లైంట్ ఫామ్ ఇచ్చాక.. దానిని  నింపి నకిలీ నోటుతో పాటు స్టేట్మెంట్‌ను జత చేసి బ్యాంకుకు ఇవ్వాలి. అప్పుడు బ్యాంకు ఆ నకిలీ నోటును, అందించిన వివరాలను తనిఖీ చేసి..మంచి నోటును ఇస్తుంది. ఒకవేళ పెద్ద మొత్తంలో డబ్బును కనుక విత్‌డ్రా చేసి అందులో కనుక నకిలీ నోట్లు దొరికితే, మీరు ఈ నోట్లతో ఆర్బీఐకి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ స్టేట్మెంట్ , నోట్లు ఆర్‌బీఐకి ఇవ్వాలి. ఆ తర్వాత ఆర్‌బీఐ విచారణ జరిపాక మాత్రమే ఆ డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − six =