అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక అక్రమ వలస దారులను తిరిగి వారి స్వస్థలాలకు పంపడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. చొరబాటుదార్లను గుర్తించి ప్రత్యేక విమానాల ద్వారా వారివారి ఇళ్లకు పంపించి వేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఈకార్యక్రమం జరుగుతుండగా..వీటి కోసం అమెరికా భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. విమానంలో అక్రమ వలసదారులను పంపడానికి ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేందుకు అమెరికా రక్షణ శాఖ రెండు సీ-17, రెండు సీ-130ఈ మిలిటరీ విమానాలను ఉపయోగిస్తోంది. అయితే సీ-17 విమాన నిర్వహణ ఖర్చు గంటకు 21 వేల డాలర్లు కాగా.. సీ-130 విమానానికి గంటకు 68 వేల నుంచి 71 వేల డాలర్లు ఖర్చు అవుతుందట. ఇలా సీ-17 విమానానికి ఒక రోజుకు అంటే 24 గంటలకు 5.04 లక్షల డాలర్లు అవుతుందని.. సీ-130ఈ కి 16.32 లక్షల డాలర్ల నుంచి 17.04 లక్షల డాలర్లు ఖర్చు అవుతుందని అక్కడి మీడియాలు ప్రత్యేక కథనాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా గ్వాటెమాలాకు పంపించడానికి ఒక్కో వ్యక్తికి సాధారణ టికెట్ ధర 853 డాలర్లు మాత్రమే ఉండగా.. 4,675 డాలర్లు ఖర్చు చేస్తుంది.ఈ లెక్కన గ్వాటెమాలాకు పంపడానికి ఒక్కో వ్యక్తికి సాధారణ విమాన ధరతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ ధరను ట్రంప్ ఖర్చుపెడుతున్నారు. ఈ ధరలు అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నడిపించే చార్టర్ ఫ్లైట్ టికెట్ల ధరల కంటే కూడా ఎక్కువేనట. అలాగే సీ-17 విమానం ద్వారా 205 మంది భారతీయులను అమెరికా సర్కారు ఇండియాకి తరలించింది. అయితే దీని ప్రయాణ సమయం 24 గంటలు కాగా.. ఒక్కో వ్యక్తిపై యూఎస్ 5.04 లక్షలు ఖర్చు చేసింది. ఇలా 205 మందికి గాను 10 కోట్ల 32 లక్షల 20 వేల డాలర్లు ఖర్చు చేసిందన్న మాట.