స్టార్టప్‌ ర్యాంకింగ్స్-2021 విడుదల, టాప్ పెర్ఫార్మర్స్ జాబితాలో తెలంగాణ

National Startup Rankings-2021 Telangana State Got Top Performers Award, Telangana State Got Top Performers Award, National Startup Rankings-2021, Top Performers Award, Telangana State Got top performer in creating StartUp ecosystem, StartUp ecosystem, Start-Up Ranking of States 2021, Telangana State, 2021 National Startup Rankings, National Startup Rankings, National Startup Rankings-2021 News, National Startup Rankings-2021 Latest News, National Startup Rankings-2021 Latest Updates, National Startup Rankings-2021 Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్స్‌కు మద్దతుపై రాష్ట్రాల ర్యాంకింగ్ మూడవ ఎడిషన్ ఫలితాలను కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం న్యూఢిల్లీలోని అశోక్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ర్యాంకింగ్ లో భాగంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలును బెస్ట్ పెర్ఫార్మర్స్, టాప్ పెర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్ మరియు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ వంటి 5 వర్గాలుగా వర్గీకరించారు. తాజా స్టార్టప్ ర్యాంకింగ్స్-2021 లో తెలంగాణ రాష్ట్రం వివిధ కేటగిరీల్లో సత్తా చాటి “టాప్ పెర్ఫార్మర్స్” జాబితాలో నిలిచింది. స్టార్టప్‌ సంస్థలను ప్రోత్సహించడం, అధునాతన ఎకోసిస్టమ్‌ను నిర్మించడంలో తెలంగాణ ముందంజలో ఉండి, టాప్ పెర్ఫార్మర్స్ అవార్డు పొందింది.

అలాగే ర్యాంకింగ్ ఇచ్చేందుకు కేంద్రం పరిగణనలోకి తీసుకున్న 7 సంస్కరణల అంశాల్లో ఇన్‌స్టిట్యూషనల్‌ చాంపియన్‌, ఇన్నోవేటివ్‌ లీడర్‌, ఇంక్యుబేషన్‌ హబ్‌, కెపాసిటీ బిల్డింగ్‌ పయనీర్‌ వంటి నాలుగింటిలో తెలంగాణ రాష్ట్రం లీడర్ గా నిలిచింది. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ నుంచి తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ప్రతినిధి శాంత తౌటం ఈ అవార్డును అందుకున్నారు.

స్టార్టప్‌ ర్యాంకింగ్స్-2021 జాబితా:

  • బెస్ట్ పెర్ఫార్మర్స్: గుజరాత్, కర్నాటక, ఢిల్లీ (ఎన్సీటీ), మేఘాలయ
  • టాప్ పెర్ఫార్మర్స్ : తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూ అండ్ కాశ్మీర్
  • లీడర్స్: అస్సాం, పంజాబ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, గోవా
  • ఆస్పైరింగ్ లీడర్స్: ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ & డామన్ అండ్ డయ్యూ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, పుదుచ్చేరి, త్రిపుర
  • ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్: ఆంధ్రప్రదేశ్, బీహార్, మిజోరాం, లద్దాఖ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − two =