సెప్టెంబర్‌ 3న ఆర్టెమిస్‌-1 ప్రయోగం, నాసా ప్రకటన

NASA Announces Artemis 1 will be Launch on September 3rd, NASA Is Set To Launch The Artemis 1 Mission, NASA Artemis I Mission Launch, Mango News, Artemis 1 Launch, NASA Artemis I Moon Mission Launch, NASA Artemis 1 Moon Mission, Artemis I Launch Latest News And Updates, NASA Artemis 1 Launch Live Updates, NASA Artemis I Mission Launch Live Updates, NASA, National Aeronautics and Space AdministrationNational Aeronautics And Space Administration,

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) చంద్రుడిపైకి వ్యోమ నౌకలను పంపేందుకు 50 ఏళ్ల అనంతరం ప్రతిష్టాత్మకంగా ఆర్టెమిస్‌ 1 ప్రయోగం తలపెడుతున్న విషయం తెలిసిందే. కాగా ఆర్టెమిస్‌ 1 ప్రయోగాన్ని సెప్టెంబర్‌ 3వ తేదీన చేపట్టనున్నట్టు నాసా అధికారికంగా ప్రకటించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి సెప్టెంబర్ 3, శనివారం మధ్యాహ్నాం 2.17 గంటలకు(ఈస్ట్రన్ డేలైట్ టైమ్) నాసా మొదటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఆర్టెమిస్‌ 1 లో భాగంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్, ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ మరియు గ్రౌండ్ సిస్టమ్స్ ను ప్రయోగించనున్నట్టు నాసా తెలిపింది. ఈ ప్రయత్నానికి రెండు గంటల లాంచ్ విండో ఉంటుందని తెలిపారు. ఆర్టెమిస్ 1 ఫ్లైట్ టెస్ట్ అనేది చంద్రుని చుట్టూ సిబ్బంది లేని మిషన్ అని, ఇది ఆర్టెమిస్‌లో భాగంగా సిబ్బందితో కూడిన ఫ్లైట్ టెస్ట్ కు మరియు భవిష్యత్తులో హ్యూమన్ లూనార్ అన్వేషణకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.

ముందుగా ఆర్టెమిస్‌ 1 ప్రయోగాన్ని ఆగస్ట్ 29, సోమవారం ఉదయం తలపెట్టగా, చివరి గంటలో వాయిదా పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌లో ఆర్ఎస్-25 ఇంజిన్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తునట్టుగా నాసా ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టెమిస్‌-1 ప్రయోగం సెప్టెంబర్‌ 3న చేపట్టనున్నట్టు నాసా ప్రకటించింది.

ఆర్టెమిస్‌ 1 పేరుతో 50 ఏళ్ల తర్వాత నాసా అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి పంపేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఆర్టెమిస్ 1 అనేది చంద్రుడు మరియు అంగారక గ్రహంపై మానవ అన్వేషణను ప్రారంభించే సంక్లిష్టమైన మిషన్ల శ్రేణిలో మొదటిది. ఈ ప్రయోగంలో ప్రధానంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌, ఓరియన్ క్యాప్సూల్ ఉండనుంది. అయితే వ్యోమగాములు లేకుండానే ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్ 1 ఆరు వారాల పాటు కొనసాగనుండగా, తరువాత ఆర్టెమిస్ మిషన్లలో ఉపయోగించబడే అన్ని రాకెట్ దశలు మరియు అంతరిక్ష నౌకలను ఇది పరీక్షించనుంది. ఆర్టెమిస్‌ 1 కక్ష్యకు చేరుకున్న తర్వాత మరియు ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ చేసిన తర్వాత, మిషన్ పది క్యూబ్‌శాట్ ఉపగ్రహాలను మోహరిస్తుంది. ఇక ఓరియన్ అంతరిక్ష నౌక ఆరు రోజుల పాటు సుదూర తిరోగమన కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఓరియన్ తిరిగి భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించి, దాని ఉష్ణ కవచం ద్వారా రక్షించబడుతూ, పసిఫిక్ మహాసముద్రంలో పడనుంది. ఇక తరవాత చేపట్టే ఆర్టెమిస్‌-2, ఆర్టెమిస్‌-3 ప్రయోగాలు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + thirteen =