2025 సంవత్సరంలో అప్పుడే ఫిబ్రవరి రెండో వారంలోకి వచ్చేసాం. మరోనెలలో టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాబోతున్నాయి. దీంతో చాలాపిల్లలకు తాము చదివింది గుర్తుండటం లేదన్న టెన్షన్ మొదలయింది. ఇలాంటివారు వారి ఆహారంలోనే కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు డాక్టర్లు.
సరైన నిద్ర,ఆహారం లేకపోవడం, వ్యాయామానికి సమయం కేటాయించకపోవడంతో మెదడుపై.. ముఖ్యంగా మెమరీ పవర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయిని అంటున్నారు. అందుకే దీనికి మంచి ఫుడ్ తో చెక్ పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు.
మెదడు ఆరోగ్యంగా ఉండి.. జ్ఞాపక శక్తి పెరగాలంటే ఫ్లేవనాయిడ్స్ ఉండే పండ్లు, కూరగాయలు తినటం చాలా మంచిదంటున్నారు డాక్టర్లు. అలాగే క్యారెట్లు, స్ట్రాబెర్రీలు, యాపిల్స్ సహా ఇతర పండ్లు ఎక్కువగా తింటే మెదడు చాలా చురుగ్గా పని చేస్తుందని చెబుతున్నారు. ఇక క్యారెట్లలో బీటా కెరోటిన్ ఇంకా స్ట్రాబెర్రీలలో ఉండే ఫ్లేవోన్ అలాగే యాపిల్స్‌లో ఉండే ఆంథోసైనిన్ మెదడులోని నరాలను బాగా ఉత్తేజితం చేస్తాయని ..అందువల్ల మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణుల పరిశోధనలో తేలింది.
అలాగే క్యాబేజ్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రమాదకరమైన వైరస్ నుంచి క్యాబేజ్ మనల్ని రక్షించి బయట పడేస్తుంది.ఎర్ర క్యాబేజ్ లో వుండే ఫ్లేవనాయిడ్స్ మెదడుకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఎర్ర క్యాబేజీని ఎక్కువగా తినడం మంచిది. అలాగే సోయా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రైనో వైరస్, ఇన్ఫ్లుఎంజా వైరస్ లాంటి వాటి నుంచి కాపాడి మెదడుని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటే మెమరీ పవర్ కూడా బాగుంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఎర్ర ద్రాక్షలో కూడా కామన్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వేరే ద్రాక్షతో పోలిస్తే ఈ ఎర్ర ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బెర్రీ పండ్లను రోజూ తినటం వల్ల అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. అలాగే స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ ఇంకా రాస్బెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బ్రెయిన్ పనితీరును ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మన మెదడులో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని ఇవి తగ్గిస్తాయి. దీనివల్ల మెమరీ పవర్ బాగా పెరుగుతుంది.
ఇక కమలాపండ్లు వల్ల కూడా మంచి ఫ్లేవనాయిడ్స్ మెదడుకి అందుతాయి. కమలాపండులో ఉండే ఫ్లేవనాయిడ్స్ జలుబు, ఫ్లూ ఇంకా దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజూ కూడా ఆరెంజ్ జ్యూస్ ని తాగడం వల్ల మెదడుకి మంచి ఫ్లేవనాయిడ్స్ అంది మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో సహాయ పడుతుంది.ఇలా ఈ ఆహారాన్ని తీసుకుంటూ మెమరీ పవర్ ను ఈజీగా పెంచుకుని పరీక్షల్లో అనుకున్న ఫలితాలు సాదించవచ్చని డాక్టర్లు అంటున్నారు.