రతన్‌ టాటా వీలునామాలో ఉన్న మోహినీ మోహన్ దత్తా ఎవరు?

Who Is Mohini Mohan Dutta In Ratan Tatas Testament, Who Is Mohini Mohan Dutta, Ratan Tatas Testament, Mohan Dutta, Mohini Mohan Dutta In Ratan Tata’s Testament, Ratan Tata, Ratan Tata Testament, Testament, TATA, India, National News, International News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా..వీలునామా తాజాగా సంచలనాలకు కేరాఫ్‌గా మారింది. రతన్ టాటా వీలునామా ఓపెన్ చేస్తే.. అందులో ఉన్న ఓపేరు టాటా కుటుంబ సభ్యులనే కాదు.యావత్ దేశాన్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. రతన్‌ టాటా మిగిలిన ఆస్తుల్లో మూడింట ఒక వంతు ట్రావెల్‌ సెక్టార్‌లోని ఎంటర్ ప్రెన్యూర్ మోహనీ మోహన్ దత్తాకు చెందాలని వీలునామాలో రాసి ఉండటంతో.. ఇప్పుడీ అంశంపై దేశవ్యాప్తంగా డీప్ డిస్కషన్ జరుగుతోంది.

రతన్ టాటా వీలునామా ప్రకారం ..ఆస్తులన్నీ వారసులకు పంచాక, ఫైనల్ ఎక్స్‌పెన్స్‌లు చెల్లించేశాక మిగిలిన రెసిడ్యువల్ అసెట్స్ విలువ దాదాపు 500కోట్లు ఉంటుందని అంచనా. ఈమొత్తం ఆస్తులు మోహినీ మోహన్‌ దత్తాకు ఇవ్వాలని రతనా టాటా వీలునామాలో రాశారు. దీంతో ఇప్పుడీ మోహనీ మోహన్ దత్తా ఎవరన్నదానిపై పెద్ద చర్చ జరుగుతోంది.

ఎందుకంటే రతన్ టాటాతో మోహినీ మోహన్ దత్తాకు ఉన్న అనుబంధం చాలామందికి తెలియదు. అతడు చాలా సంవత్సరాలుగా టాటాకు నమ్మకమైన అసోసియేట్‌గా ఉన్నాడని రతన్ టాటా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మోహినీ మోహన్ దత్తా కుటుంబానికి 2013లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో విలీనమైన స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీ ఉండేది. ఈ విలీనానికి ముందు మోహన్ దత్తా, అతని కుటుంబం స్టాలియన్‌లో 80% వాటాను కలిగి ఉండగా.. టాటా ఇండస్ట్రీస్ మిగిలిన 20 శాతం వాటాను హోల్డ్‌ చేస్తుండేది. దత్తా గతంలో థామస్ కుక్‌కి అనుబంధంగా ఉన్న టీసీ ట్రావెల్ సర్వీసెస్‌లో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

రతన్ టాటా చనిపోవడానికి ముందు రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్‌తో పాటు.. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రతన్ టాటాకు టాటా సన్స్ లో డైరక్టుగా 0.83 శాతం వాటా ఉంది. ఇదే సుమారు 8,000 కోట్ల రూపాయలుగా ఉంటుంది. వివిధ స్టార్టప్ లలో వాటాలు, ఆర్ ఎన్ టీ అసోసియేట్స్ లో 186 కోట్ల రూపాయల పెట్టుబడులున్నాయి. పెయింటింగ్స్ తో సహా ఖరీదైన ఆర్ట్ వర్క్ తో పాటు లగ్జరీ ఆస్తులు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రస్తుత మార్కెట్ విలువ వద్ద వాటి వాల్యుయేషన్ ఇంకా పూర్తి కాకపోవడంతో.. రతన్ టాటా మొత్తం నికర విలువ ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.

మోహని మోహన్ దత్తా 2024 అక్టోబర్ లో జరిగిన టాటా అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. ఆయితే ఆసమయంలో ఎవరికీ పెద్దగా దత్తా తెలియదు. ఆ సమయంలో దత్తా ఇచ్చిన ఓ ఇంటర్య్లూలో రతన్ టాటాతో తనకు 60 సంవత్సరాల స్నేహం ఉందని చెప్పారు. తాను రతన్ టాటాను మొదటిసారి 24 ఏళ్ల వయసులో కలిశామని, తన అభివృద్ధికి రతన్ చాలా సహాయపడ్డారని దత్తా తెలిపారు. మోహినీ మోహన్ దత్తా వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు.

రతన్ టాటా రాసిన వీలునామా ప్రకారం, రతన్ టాటా ఎస్టేట్‌లో మూడింట ఒక వంతు మోహినీ మోహన్‌కు ఇవ్వాలి. మూడో వంతు అంటే 500 కోట్లు ఉంటుందని అంచనా. మిగిలిన రెండు భాగాలు రతన్ టాటా ఇద్దరు సోదరీమణులకు వెళ్తాయి.అయితే ఆ వీలునామాలో రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా, అతని పిల్లల పేర్లు లేవు. ముందుగా ఈ వీలునామాను హైకోర్టు ధ్రువీకరించిన తర్వాతే దీనిని అమలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.